
మంచి రికార్డున్న బౌలర్!
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు కూడా ఎడం చేతి వాటం స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించింది. అందుకే యువ స్పిన్నర్ మాథ్యూ కనెమన్‌ను పిలిపిస్తోంది. గతేడాది శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచుల వన్డే సిరీసులో కనెమన్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 13 మ్యాచులు ఆడిన అతను 34.80 సగటుతో 35 వికెట్లు తీశాడు. బిగ్ బ్యాష్ లీగ్‌లో కూడా బ్రిస్బేన్ హీట్ తరఫున రాణించాడు. 2022-23 సీజన్‌లో 26.50 సగటుతో 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ కాన్ఫిడెన్స్‌తో వెళ్తున్నా..
తను భారత్‌కు పెద్దగా ప్లాన్లు వేసుకొని వెళ్లడం లేదని కనెమన్ చెప్పాడు. 'నేను అక్కడికి ఓపెన్ మైండ్‌తో వెళ్తున్నా. ప్రస్తుతానికైతే షీల్డ్ గేమ్‌లో మూడో రోజు ఆడేందుకు వెళ్తున్నా అంతే. నాకు జార్జ్ బైలీ నుంచి కాల్ వచ్చింది. నన్ను భారత్‌తో ఆడే బృందంలో కలుపుతున్నట్లు చెప్పారు. ఆ ఆలోచన నాకు అంతకుముందే వచ్చింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు' అని చెప్పాడు. లంక సిరీసులో నెట్స్‌లో బౌలింగ్ చేశానని, అదే కాన్ఫిడెన్స్‌తో భారత్‌లో అడుగు పెడతానని అన్నాడు.

జడేజాలా ఆడాలని..
'ఆ సిరీసులో టెస్టు ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ చేశా. కొన్ని వారాలు అక్కడ బౌలింగ్ చేశా. అక్కడే శ్రీలంక బౌలర్లు ఎలా ఆడారు? నాథన్ లియాన్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు గమనించా. ఇప్పుడు భారత్ వెళ్లి మళ్లీ జట్టుతో కలిసేందుకు ఎగ్జయిటింగ్‌గా ఉంది' అని కనెమన్ తెలిపాడు. తనకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టమని, తను అభిమానించే ఆటగాళ్లలో ఒకడని చెప్పాడు. 'తను నా ఫేవరెట్లలో ఒకడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేను కూడా అలాగే ఆడాలని అనుకుంటా. అతను, అక్షర్ పటేల్‌లా ఆడేందుకు నేను ట్రై చేస్తుంటా' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
