డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం: 1-0తో ఆధిక్యం

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా గొప్పగా ఆరంభించింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో భారీ తేడాతో విజయం సాధించింది. 293/9 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజైన సోమవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో ఐదు పరుగులు జోడించి ఆలౌటైంది.
Australia vs South Africa 2018 1st Test Score Card
క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతున్న క్వింటన్ డీకాక్‌ను 83 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా జోష్ హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చడంతో సఫారీ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మర్‌క్రామ్ (143), డీకాక్ (83) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు సాధించగా, హాజెల్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. కమిన్స్, మిచెల్ మార్ష్‌లకు చెరో వికెట్ లభించింది. తొలి టెస్టులో విజయం సాధించడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన మిచెల్ స్టార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వార్నర్, డీకాక్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది.
తొలి టెస్టులో స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా: 351 ఆలౌట్
దక్షిణాఫ్రికా: 162 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా: 227 ఆలౌట్
దక్షిణాఫ్రికా: 298 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో విజయం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications