Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ చేతిలో భారత్ చిత్తు

Brett Lee

మెల్ బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ను ఆస్ట్ర్రేలియా జట్టు గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 337 పరుగుల భారీ స్కోరు తేడాతో ఓడిపోయింది. 499 పరుగుల భారీ విజయ లక్ష్యంతో తన రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత జట్టు 161 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులు మాత్రమే చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో మరింత దారుణంగా ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో 343 పరుగులు చేసిన ఆస్ట్ర్రేలియా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసిన తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ కు సవాల్ విసిరింది. వికెట్ నష్టపోకుండా 6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట నాల్గవ రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టులో లక్ష్మణ్ 42, గంగూలీ 40 పరుగులు తప్ప అంతా ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ 3 వికెట్లు, బ్రెట్ లీ, హాగ్ రెండేసి వికెట్లు పడగొట్టి భారత్ ను మట్టి కరిపించారు. నాల్గవ రోజే జయకేతనం ఎగురవేసిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు మ్యాచ్ ల గవాస్కర్-బోర్డర్ టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Story first published: Saturday, December 29, 2007, 23:53 [IST]
Other articles published on Dec 29, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+