For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాడు భర్త-నేడు భార్య: ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ: మహిళల ప్రపంచ కప్ విజేతగా

Australia beat England by 71 runs to win ICC Womens World Cup.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. ఆకాశమే హద్దుగా ఆడింది. కొత్త రికార్డులను నెలకొల్పింది. క్రైస్ట్‌చర్చ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. 71 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీనితో పాటు ప్రపంచ కప్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ- కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయింది.

356 పరుగుల టార్గెట్..

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ను నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఓపెనర్ అలీస్సా హీలీ సెంచరీని బాది అవతల పడేసింది. 100 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసింది హీలీ. ఈ టోర్నమెంట్‌లో ఆమె ట్రిపుల్ డిజిట్ ఫిగర్‌ను అందుకోవడం వరుసగా ఇది రెండోసారి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆమె సెంచరీ సాధించింది. 138 బంతుల్లో 170 పరుగులు చేసి, అవుట్ అయింది.

170 పరుగులతో చెలరేగిన హీలీ..

ఓపెనర్‌గా బరిలోకి దిగిన హీలీ.. క్రీజ్‌లో పాతకుపోయింది. 45 ఓవర్‌లో వెనుదిరిగింది. ష్రుబ్‌సోల్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి స్టంపౌట్‌ అయింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసిన హీలీ- ఆ తరువాత 38 బంతుల్లోనే 70 రన్స్ కొట్టిందంటే- ఆమె ఇన్నింగ్ ఎంత వేగంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇన్నింగ్‌లో 26 ఫోర్లు నమోదయ్యాయి. చివరి ఓవర్లల్లో వరుస ఫోర్లతో విరుచుకుని పడింది. వన్‌డౌన్ బ్యాటర్ మూనీతో కలిసి 43, 44 ఓవర్లల్లో 37 పరుగులను పిండుకుందామె.

285 పరుగులకు ఆలౌట్..

మరో ఓపెనర్ రాఛెల్ హేన్స్‌ 93 బంతుల్లో ఏడు ఫోర్లతో 68, వన్‌డౌన్ బ్యాటర్ బెత్ మూనీ 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 62, డెత్ ఓవర్లల్లో ఎల్లీస్ పెర్రీ 10 బంతుల్లో రెండు ఫోర్లతో 17 పరుగులు చేశారు. దీనితో ఆస్ట్రేలియా 356 పరుగుల చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లల్లో అన్నా ష్రుబ్‌సోల్ మూడు, సోఫీ ఎక్లెస్టోన్ ఒక వికెట్ పడగొట్టారు. 357 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ గట్టిపోటీ ఇచ్చింది. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు చేసింది.

నాట్ స్కైవర్ ఇన్నింగ్ హైలైట్..

ఓపెనర్లు టామీ బ్యోమౌంట్ 26 బంతుల్లో అయిదు ఫోర్లతో 27, హీథర్ నైట్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లతో 26, అమీ జోన్స్ 18 బంతుల్లో రెండు ఫోర్లతో 20, సోఫియా డంక్లే 22 పరుగులు చేశారు. మిడిల్ ఆర్డర్‌లో నాట్ స్కైవర్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్‌లో హైలైట్. 121 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 148 పరుగులు చేసిందామె. నాటౌట్‌గా నిలిచింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో తనకు సహకారం ఇచ్చే బ్యాటర్లు లేకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయింది.

ఆసీస్ జర్నీ ఇదీ..

ఆస్ట్రేలియా జట్టులో అలానా కింగ్, జెస్ జొనాస్సెన్ మూడు వికెట్లు చొప్పున పడగొట్టాడు. మెగాన్ షుట్ రెండు, తహ్లియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్‌నర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది ఏడోసారి. ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది.

ఎల్లీస్ పెర్రీ అరుదైన రికార్డ్..

ఆసీస్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ ఓ అరుదైన రికార్డ్‌ను నెలకొల్పారు. వరల్డ్ కప్‌లో ఆసీస్ తరఫున నాలుగు సార్లు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇందులో రెండు మ్యాచ్‌లల్లో టీమ్ గెలిచింది. కాగా- ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్ టోర్నమెంట్ అవార్డును అలీస్ హీలీ సొంతం చేసుకుంది. బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలను సాధించింది. 505 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిఛెల్ స్టార్క్ భార్య ఆమె. మిఛెల్ స్టార్క్ 2015లో ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్ టోర్నమెంట్‌ అవార్డును అందుకోగా.. అతని భార్య ఇప్పుడు అదే టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Sunday, April 3, 2022, 14:19 [IST]
Other articles published on Apr 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+