Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఇదేంట్రా అయ్యా?.. ఆసీస్ బ్యాటర్ల ప్రాక్టీస్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

Australia batters strange practice session before second INDvsAUS Test

టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా జట్టు.. రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పిచ్‌పై భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తెగ ప్రాక్టీస్ చేస్తోంది. నెట్స్‌లో ఆసీస్ కీలక బ్యాటర్లు అందరూ ఇదే పని మీద ఉన్నారు.

ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూసిన ఫ్యాన్స్ షాకై షేకైపోతున్నారు. ఇదేంట్రా అయ్యా? నేనెప్పుడూ చూడలా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ ప్రాక్టీస్ వేస్ట్..

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా ఆసీస్ బ్యాటర్లు తెగ కష్టపడ్డారు. అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ప్లాన్ వేశారు. అచ్చం అతనిలాగే బౌలింగ్ చేసే కుర్రాడిని తీసుకొచ్చి నెట్స్‌లో బౌలర్‌గా పెట్టుకున్నారు. ఇంత చేసినా వాళ్ల తలరాత మాత్రం మారలేదు. అశ్విన్, జడేజా బౌలింగ్‌కు బెంబేలెత్తిపోయారు. ఆ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

వాళ్లిద్దరే కీలకం..

వాళ్లిద్దరే కీలకం..

ఈ క్రమంలోనే రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ భారం ఎక్కువగా పడేది మిడిలార్డర్‌పైనే. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్.. ఈ ఇద్దరూ కనుక భారీ స్కోర్లు చేయకపోతే ఆసీస్ ఈ సిరీస్‌లో వైట్ వాష్ ఎదుర్కొంటుందని సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు హెచ్చరికలు కూడా చేశారు. అది చూస్తేనే వాళ్లు ఆ జట్టులో ఎంత కీలకమో తెలుస్తుంది. వీళ్లిద్దరూ కూడా ఈ విషయం అర్థం చేసుకున్నారు. అందుకునే స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వింత ప్రాక్టీస్ చేస్తున్నారు.

వింత ప్రాక్టీస్ సెషన్..

వింత ప్రాక్టీస్ సెషన్..

రెండో టెస్టుకు ముందు స్మిత్, లబుషేన్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే నెట్‌లో వికెట్ల ముందు స్టీవ్ స్మిత్ నిలబడి ప్రాక్టీస్ చేస్తుండగా.. వికెట్ల వెనుక లబుషేన్ నిలబడి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కళ్లు బైర్లు కమ్మాయి. 'అరేయ్ నాయనా.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయండ్రా అంటే ఇలా కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకురా?' అంటూ వాళ్లను ఎద్దేవా చేస్తున్నారు. కొందరేమో అశ్విన్, జడ్డూను ఎదుర్కోవాలంటే ఇలా ప్రాక్టీస్ చేయకతప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు. 'ఒకళ్లు స్పిన్ అయిన బంతిని, మరొకరు స్ట్రెయిట్‌గా వచ్చే బంతిని ఆడేందుకే ఈ ప్రాక్టీస్' అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.

Story first published: Thursday, February 16, 2023, 19:07 [IST]
Other articles published on Feb 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+