Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విచిత్రమైన బ్యాటింగ్‌ శైలి.. చందర్‌పాల్‌ను గుర్తు చేసిన బెయిలీ (వీడియో)!!

Australia Batsman George Bailey stuns cricket fraternity with Shivnarine Chanderpaul like batting stance

హోబార్ట్‌: క్రికెట్ ఆటలో ఒక్కో బ్యాట్స్‌మన్‌ శైలి ఒక్కో విధంగా ఉంటుంది. విండీస్‌ మాజీ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ బ్యాటింగ్‌ శైలి అందరికంటే కాస్త బిన్నంగా ఉంటుంది. వికెట్లకు పూర్తిగా అడ్డుగా నిలబడి చందర్‌పాల్‌ బ్యాటింగ్‌ చేస్తాడు. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ జార్జ్‌ బెయిలీ విచిత్ర బ్యాటింగ్‌ పొజిషన్‌తో చందర్‌పాల్‌ను గుర్తు చేసాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా టాస్మానియా, విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెయిలీ విచిత్రమైన శైలిలో బ్యాటింగ్‌ చేసి అందరిని ఆకట్టుకున్నాడు.

జార్జ్‌ బెయిలీ దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్‌ తరఫున చివరిసారి ఆడాడు. 2016 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాడు. ఇటీవల షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా టాస్మానియా తరఫున ఆడుతున్న బెయిలీ 25వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. విక్టోరియా వికెట్‌ కీపర్‌ వైపు నిల్చొని కనిపించాడు. అయితే బౌలర్‌ బంతిని విసరగానే సహజపద్ధతిలోకి వచ్చి షాట్‌ ఆడాడు.

బెయిలీ మొత్తం వికెట్లను కవర్‌ చేసి ఆడటం అభిమానుల్లో నవ్వులు పూయించింది. అటు బౌలర్లను, ఇటు చూసే వాళ్లను బెయిలీ తన బ్యాటింగ్‌ తికమకపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ క్రీడా వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ అయింది. వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. 'బెయిలీ విండీస్‌ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ బ్యాటింగ్‌ను గుర్తుచేసాడు' అని ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్‌ కామెంట్ చేసాడు. కాగా.. బెయిలీ ఈ మ్యాచ్‌లో 41, 10 పరుగులు చేశాడు. టాస్మానియా మ్యాచ్‌ గెలిచింది.

బెయిలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్‌ తరఫున చివరిసారి ఆడాడు. బెయిలీ ఆస్ట్రేలియా టీ20 జట్టు మాజీ కెప్టెన్, వన్డే జట్టు వైస్ కెప్టెన్. ఆస్ట్రేలియా తరఫున ఐదు టెస్టులు, 90 వన్డేలు, 30 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3,044 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 156.

Story first published: Monday, November 4, 2019, 10:37 [IST]
Other articles published on Nov 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+