సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దంపతులు పండంటి ఆడశిశువు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. తన భార్య కెన్డైస్, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వార్నర్ తెలిపాడు.
డేవిడ్ వార్నర్ దంపతులకు ఈ శిశువు రెండో బిడ్డ. ఇండి రేగా పాపకు నామకరణం చేసినట్లు వార్నర్ వెల్లడించాడు. కాగా, వార్నర్, కెన్డైస్‌లకు 16 నెలల వయసున్న కూతురు ఉంది. పేరు ఇవీ మాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తన రెండో కూతురు ఫోటోలతో పాటు భార్య, మొదటి కూతురు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఆస్టేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే తర్వాత డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పితృత్వ సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్లీ తిరిగి జనవరి 20న కాన్‌బెర్రాలో జరిగే నాల్గవ వన్డేకి జట్టులో చేరనున్నాడు. డేవిడ్ వార్నర్‌కు బదులు బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టులో అద్భుతాలు సృష్టించిన ఉస్మాన్ ఖవాజాకు తుది జట్టులో చోటు కల్పించారు.