
యాషెస్ సిరీస్‌లో మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌లకు అతిథ్య ఆస్ట్రేలియా జట్టు తమ టీంను ప్రకటించింది. తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన టీంనే తర్వాతి మూడు టెస్టులకు కూడా కొనసాగించనున్నట్లు ఆ టీమ్ సెలెక్టర్లు ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన కెప్టెన్ పాట్ కమిన్స్‌తోపాటు గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన హేజీల్‌వుడ్ కూడా కూడా మెల్‌బోర్న్ వేదికగా జరిగే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రెండో టెస్టుకు దూరమైన వీరిద్దరి స్థానంలో మైఖేల్ నేజర్, రిచర్డ్‌సన్ ఆడిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, ఝై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ వార్ప్సన్, డేవిడ్ స్నర్వే .
కాగా తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన అతిథ్య ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. మూడింట్లో ఒక మ్యాచ్ గెలిచిన సిరీస్ ఆసీస్ సొంతం అవుతుంది. యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ బాక్సింగ్ డే సందర్భంగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది. యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ఓవల్ వేదికగా జనవరి 14 నుంచి జరగనుంది.
స్పిన్ బౌలింగ్ వేసిన పేసర్
కాగా ఆడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్సన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగా పేస్ బౌలర్ అయిన రాబిన్సన్ ఆసీస్ స్కోర్ 79-4 వద్ద ఉండగా స్పిన్ బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గ్రౌండ్‌లోని ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు కాసేపు ఆశ్యర్యంతో నవ్వుకున్నారు. అంతేకాకుండా ఆ ఓవర్‌లో రెండే పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం రాబిన్సన్ వేసిన ఈ బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రాబిన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సహా మొత్తం 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు.