తొలి టెస్టుకు ఆస్ట్రేలియా 11, మిచెల్ మార్ష్‌కు హ్యాండిచ్చి హారిస్‌కు చోటు

న్యూ ఢిల్లీ: మ్యాచ్‌కు ముందుగానే 12 మందితో కూడిన జాబితాను విడుదల చేస్తున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కూడా అదే పంథాను కొనసాగించింది. ఈ క్రమంలో టీమిండియా టెస్టు జట్టులో రోహిత్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటు ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండర్ ఆటగాడు మిచెల్ మార్ష్‌కు ఉద్వాసన పలికింది. అతని స్థానంలో దేశవాలి క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన హాండ్స్‌కోంబ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు కెప్టెన్ పైన్ తెలిపాడు.

ఏదో ఒక సమయంలో అవసరమవుతాడు
కొంత కాలంగా మార్ష్ నిలకడగా ఆడటం లేదని, అందుకే అతణ్ని ఎంపిక చేయలేదని పేర్కొన్నాడు. మరోవైపు ఓపెనర్ ఫించ్‌కు జోడీగా అరంగేట్ర ఆటగాడు హారిస్‌ను సీఏ ఎంపిక చేసింది. ‘మిచెల్ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఈ సిరీస్‌లో ఏదో ఒక సమయంలో జట్టుకు అతడి సేవలు అవసరమవుతాయని అనుకుంటున్నాం. ఫాస్ట్ బౌలర్లతో పాటు నాథన్ లియాన్ బౌలింగ్‌పై ఎంతో నమ్మకం ఉంది' అని పైన్ అన్నాడు.

తొలి టెస్టులో ఆడతాడనుకుని కోహ్లీ గురించి:
విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేక వ్యూహాల్ని జట్టు రూపొందిస్తున్నట్లు అంగీకరించిన ఈ పేసర్.. అతనితో పాటు టీమిండియా టాప్ ఆర్డర్‌పైనా ఓ కన్నేసి ఉంచినట్లు వెల్లడించాడు.
‘విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని మనందరికీ తెలుసు. టెస్టు సిరీస్‌లో అతడ్ని నిలువరించేందుకు వ్యూహాలు రూపొందించాం. కచ్చితంగా వాటిని మైదానంలో అమలు పరుస్తాం. చాలా మంది ఆస్ట్రేలియా జట్టు కేవలం విరాట్ కోహ్లీపైనే దృష్టి పెడుతోందని.. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ గురించి ఆలోచించడం లేదని అంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. భారత్ జట్టులోనూ నైపుణ్యమున్న బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వారిపైనా ఓ కన్నేసి ఉంచాం.'
తొలి టెస్టు ఆడనున్న ఇరు జట్లు
ఆస్ట్రేలియా తుది జట్టు: మార్కస్ హారిస్, ఆరొన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కంబ్, టిమ్ పైన్(సారథి), జాస్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్.
టీమిండియా (12 మంది ఆటగాళ్లు): మురళి విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(సారథి), రోహిత్ శర్మ, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవి అశ్విన్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications