Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ నలుగురు టీంలో చేరారు.. వెస్టిండీస్ సిరీస్‌కు ఆసీస్ టీం ఇదే

Australia Announce Team for T20 Series against Westindies, Marsh, Warner Enter the team

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులోకి స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి రానున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఆసీస్ టీ20 ప్రపంచ‌కప్‌కు సన్నాహాకంగా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20I సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 5న గోల్డ్ కోస్ట్‌లో తొలి టీ20, అక్టోబర్ 7న బ్రిస్బేన్‌లో రెండో టీ20 జరగనుంది. ఇక ఈ సిరీస్ కోసం వార్నర్‌, మార్ష్‌లతో పాటు మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌ కూడా మళ్లీ జట్టులో చేరనున్నారు. ఈ నలుగురు గాయాలు, టీం మేనేజ్ మెంట్ కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇకపోతే వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆస్ట్రేలియా టీంలో కెమెరూన్ గ్రీన్‌ మళ్లీ కొనసాగనున్నాడు. ఇటీవల భారత పర్యటనలో కెమరూన్ గ్రీన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే కేన్ రిచర్డ్‌సన్, అష్టన్ అగర్ కూడా జట్టుతో చేరనున్నారు.

జాతీయ సెలక్షన్ ప్యానెల్ చైర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్‌కు టైం దగ్గరపడుతున్న ఈ తరుణంలో మేము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. నలుగురు కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడంతో ఏవైనా చిన్నచిన్న లూప్ హోల్స్ ఉంటే వాటిని వెస్టిండీస్ సిరీస్లో పరిష్కరించుకోగలగవచ్చు.' అని బెయిలీ అన్నాడు. వెస్టిండీస్‌తో T20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20I సిరీస్ ఉంటుంది. టీ20ప్రపంచకప్ కోసం అక్టోబర్ 17న గబ్బాలో ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

వెస్టిండీస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీ20 జట్టు:
ఆరోన్ ఫించ్ ( కెప్టెన్ ), సీన్ అబాట్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, వార్నర్

Story first published: Wednesday, September 28, 2022, 8:49 [IST]
Other articles published on Sep 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+