
ఇద్దరు కొత్త కుర్రాళ్లకు జట్టులో చోటు
ఆస్ట్రేలియా తరుపున ఇద్దరు కొత్త కుర్రాళ్లు ఈ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ ఆటగాడు మార్కస్ హారిస్ తొలిసారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అతడితో పాటు బౌలర్ క్రిస్ ట్రెమెయిన్‌కు కూడా టెస్టు అరంగేట్రానికి అవకాశమిచ్చారు.

ఆసీస్ కెప్టెన్‌గా టిమ్ ఫైన్
భారత్‌తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టిమ్ ఫైన్ ఆసీస్ కెప్టెన్‌గా వ్వహారిస్తోండగా... హజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకుండా ఆసీస్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టు సిరిస్ కావడంతో అందరూ ఈ సిరిస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ
తొలి రెండు టెస్టులకు జట్టు ఎంపిక అనంతం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో అద్భుత ప్రదర్శన చేయగల సత్తా ఉన్నా ఆటగాళ్లే. దీనికితోడు కొత్తగా చోటు దక్కించుకున్న ఆటగాళ్లు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం" అని అన్నారు.

ఆస్ట్రేలియా జట్టు:
టిమ్ ఫైన్(కెప్టెన్, వికెట్‌కీపర్), అరోన్ ఫించ్, పాట్ కమిన్స్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, మార్కస్ హారిస్, హజిల్‌వుడ్(వైస్ కెప్టెన్), ట్రావిస్ హేడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్(వైస్ కెప్టెన్), షాన్ మార్ష్, మిచెల్ స్టార్క్, క్రిస్ ట్రెమెయిన్, పీటర్ సిడిల్.


Click it and Unblock the Notifications












