Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత పర్యటనకు వచ్చే స్మిత్ సేన ఇదే: స్టార్క్‌కు దక్కని చోటు

హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య మొదలయ్యే వన్డే, టీ20 సిరిస్‌ కోసం భారత పర్యటనకు వచ్చే జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 5 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే, టీ20 మ్యాచ్‌ల కోసం విడివిడిగా జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

జేమ్స్ ఫాల్కనర్, నాథన్ కౌల్ట‌ర్ నీల్‌లు మ‌రోసారి టీమ్‌లోకి వ‌చ్చారు. గాయంతో బాధపడుతున్న ఆసీస్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌కు భారత పర్యటనలో చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ నవంబరులో ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ని కోసం స్టార్క్‌కు విశ్రాంతి కల్పించినట్లు బోర్డు ప్రతినిధులు తెలిపారు.

Australia announce ODI, T20I squads for India series; Faulkner makes a come back

సెప్టెంబ‌ర్ 17 నుంచి అక్టోబ‌ర్ 11 వ‌ర‌కు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడిన మోయిసెస్ హెన్రిక్స్‌, మిచెల్ స్టార్క్‌, క్రిస్ లిన్‌, జాన్ హాస్టింగ్స్‌, జేమ్స్ పాటిన్‌స‌న్‌ల‌కు జట్టులో చోటు ద‌క్క‌లేదు. మరోవైపు పేసర్లు జేమ్స్‌ ఫాల్కనర్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, ఆల్‌రౌండర్లు ఆస్టన్‌ అగర్‌, హిల్టన్‌ కార్ట్‌రైట్‌ వన్డే జట్టులో చోటు లభించింది.

వన్డే, టీ20 జట్లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌కు చెన్నై, బెంగళూరు, నాగ్ పూర్, ఇండోర్, కోల్ కతా ఆతిథ్యమిస్తుండగా టీ20 సిరిస్‌కు హైదరాబాద్, రాంచీ, గౌహతి ఆతిథ్యమిస్తున్నాయి. ప్రస్తుతం కోహ్లీ సేన లంక పర్యటనలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌‌ పర్యటనలో ఉంది.

వన్డే జట్టు:
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌(వైస్‌ కెప్టెన్‌), ఆస్టన్‌ అగర్‌, హిల్టన్‌ కార్డ్‌రైట్‌, నాధన్‌ కౌల్టర్‌ నైల్‌, కమిన్స్‌, జేమ్స్‌ ఫాల్కనర్‌, అరోన్‌ ఫించ్‌, హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మాథ్యూ వేడ్‌, అడమ్‌ జంపా

టీ20 జట్టు: స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌(వైస్‌ కెప్టెన్‌), జాసన్‌ బెహ్రెన్‌డోర్ఫ్‌, డాన్‌ క్రిస్టియన్‌, నాధన్‌ కౌల్టర్‌ నైల్‌, కమిన్స్‌, అరోన్‌ ఫించ్‌, ట్రావిస్‌ హెడ్‌, మొయిస్‌ హెన్రిక్స్‌, మ్యాక్స్‌వెల్‌, టిమ్‌ పైని, కేన్‌ రిచర్డ్‌సన్‌, అడమ్‌ జంపా.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+