Australia team: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్. ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ గేమ్ మొదలైంది. సమవుజ్జీల మధ్య పోరు ఇది. స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు ఆస్ట్రేలియా ఓపెనర్లు. మాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్‌లో డేవిడ్ వార్నర్ రెండు బౌండరీలను సాధించాడు. స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తోన్నాడు.

ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే- భారత్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది ఆస్ట్రేలియాకు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభం కావడానికి ముందు భారత్‌తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడింది ఆసీస్. 2-1 తేడాతో ఆ సిరీస్‌ను కోల్పోయింది. దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ ఆడాల్సి ఉందా జట్టుకు.
నవంబర్ 19వ తేదీన వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగియనుండగా.. అదే నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్ మొదలవుతుంది. పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.
ఈ టీ20 సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులు ఉండే టీమ్ ఇది. వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. దీనికి సారథ్యాన్ని వహిస్తాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది వేడ్‌కు. అందుకే కీలకమైన ఈ సిరీస్ కోసం అతనికి జట్టు పగ్గాలను అప్పగించింది.
ఇందులో- జేసన్ బెహ్రెనడార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది.