ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు.. ఇప్పుడీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవం చర్చనీయాంశంగా మారింది. టీ20 క్రికెట్ పై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఈ మార్కస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
"దేశం తరఫున అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఇంత అంత ఈజీ డెసిషన్ కాదు. కానీ నేను ఇప్పుడు సరైన సమయంలోనే ఆటకు వీడ్కోలు పలికాను. నా కెరీర్ లోని నెక్ట్స్ చాప్టర్ పై ఇక దృష్టి సారిస్తాను. కోచ్ ఆండ్యూ మెక్ డొనాల్డ్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అతడు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు." అని మార్కస్ పేర్కొన్నాడు.

35 ఏళ్ల మార్కస్ స్టొయినిస్.. కెరీర్ లో 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 48 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరపున స్టోయినిస్ తన చివరి వన్డే మ్యాచ్ ను పాకిస్థాన్ పై ఆడాడు. ఆ మ్యాచ్ లో 8 పరుగులు చేశాడు. తన బౌలింగ్ లో 11 పరుగులు ఇచ్చాడు.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టు నుంచి ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్, జోష్ హెజిల్ వుడ్ ఆడటం అనుమానంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మార్క్ స్టోయినిస్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి బాంబు పేల్చాడు.