అందరిలానే ఆసీస్ జట్టే ఫేవరేట్ అంటోన్న రహానె

సిడ్నీ: అందరూ పాడిన పాటే టీమిండియా క్రికెటర్ రహానె కూడా పాడుతున్నాడు. కొద్ది రోజుల్లో టీమిండియా ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో అడిలైడ్‌లో జరిగే టెస్టు సిరీస్‌కి ఆసీస్ జట్టే ఫేవరెట్ అని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే అన్నాడు. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ లేకపోయినప్పటికీ వారిని తక్కువగా అంచనా వేయలేమని రహానే పేర్కొన్నాడు.

సిరీస్ గెలడం పెద్ద కష్టం కాదంటూ
టీమిండియా బ్యాటింగ్‌లో రాణిస్తే సిరీస్ గెలడం పెద్ద కష్టం కాదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అడిలైడ్‌లో గురువారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన టీమిండియా డ్రాగా ముగించుకుంది.

స్టీవ్ స్మిత్, వార్నర్‌లు లేకపోయినప్పటికీ.
‘ఏ జట్టయినా స్వదేశంలో ఆడేటప్పుడు ఉత్సాహంగానే ఉంటుందని అనుకుంటున్నా. అందుకే టెస్టు సిరీస్ గెలవడానికి ఆసీస్ జట్టే ఫేవెరెట్ అనేది నా అభిప్రాయం. వారిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, వార్నర్‌లు లేకపోయినప్పటికీ.. వాళ్లంత బలహీనంగా లేరు. వారు నిజంగా బౌలింగ్‌తో దాడి చేస్తారు. సిరీస్ గెలవాలంటే బౌలింగ్ బలంగా ఉండాలి. అందుకే ఆసీస్ ఫేవరెట్ అని చెబుతున్నాను.

ఆధిపత్యం చెలాయించడం పెద్ద కష్టమేమీ
జట్టు సమన్వయంతో ఆడితే ఆసీస్ మీద ఆధిపత్యం చెలాయించడం పెద్ద కష్టమేమీ కాదు. జట్టులో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. దాంతో పాటుగా భాగస్వామ్యం కూడా చక్కగా కుదిరితేనే టీమిండియా చేయాలనుకునేది సాధ్యపడేది. ఆస్ట్రేలియాలో ఇది బాగా ఉపయోగపడుతుంది. క్రితం సారి ఈజట్టుతో ఆడినప్పుడు ఆటను బాగా ఆస్వాదించాను' అని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications