Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీపై ఆస్ట్రేలియా మీడియా గుస్సా

Sourav Ganguly
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మీడియా ధ్వజమెత్తింది. ఉద్దేశ్యపూర్వకంగానే గంగూలీ జాప్యం చేసే వైఖరిని అవలంబించి బెంగుళూర్ టెస్టును డ్రా దిశగా తీసికెళ్లాడని ఆస్ట్రేలియా మీడియా ఆరోపించింది. బెంగుళూర్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాల్సి ఉండిందని, అయితే వెలుతురు విషయంలోని నిబంధనలు, గంగూలీ జాప్యం చేసే వైఖరి వంటి వల్ల ఆస్ట్రేలియా చేతి నుంచి విజయం చేజారిందని వ్యాఖ్యానించింది.

గంగూలీని సీరియల్ నేరగాడిగా నేషనల్ నైన్ న్యూస్ స్పోర్ట్స్ టీమ్ సభ్యుడు వ్యాఖ్యానించాడు. ఆట తిరిగి ప్రారంభం కాగానే గంగూలీ ఆస్ట్రేలియా ఫీల్డర్లను, తన తోటి బ్యాట్స్ మన్ వివియస్ లక్షణ్ ను ఆగాలని కోరాడని, తాను ప్యాడ్స్ మరిచి పోయాననే కారణంతో గంగూలీ అలా చేశాడని, దీనివల్ల సమయం వృధా కాలేదా అని అతను రాశాడు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు పరాజితులని అతను అన్నాడు. అంపైర్లను కూడా అతను తప్పు పట్టాడు. సూర్యుడు ప్రకాశిస్తుండగా వెలుతురు సరిగా లేదని రెండు సార్లు ఆటను నిలిపేయడం సరి కాదని అతను అభిప్రాయపడ్డాడు. బెంగుళూరులో లాగా మ్యాచులు జరిగితే బ్రాడ్ మాన్, గవాస్కర్, టెండూల్కర్, పాంటింగ్ లాంటి క్రీడాకారులను కూడా మరిచిపోతారని అతను వ్యాఖ్యానించాడు.

వెలుతురు విషయంలోని ప్రస్తుత నిబంధనలను సవరించాలని ఫాక్స్ స్పోర్ట్సు వ్యాఖ్యాత అభిప్రాయపడ్డాడు. వెలుతురు సరిగానే ఉందని, ఇటువంటి పరిస్థితి రాకుండా నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, October 14, 2008, 14:45 [IST]
Other articles published on Oct 14, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+