Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : టెస్టుల్లో ఫామ్ అందుకోని కోహ్లీ.. ఆసీస్ మాజీ లెజెండ్ ఏమన్నాడంటే?

 Aussie legend talks about out of form Virat Kohli in BGT series

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన పూర్వపు ఫామ్ అందుకోలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ ఫామ్ అందుకున్నట్లే కనిపించినా కూడా.. టెస్టుల్లో మాత్రం అతని చెత్త ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ రికీ పాంటింగ్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. టెస్టుల్లో కూడా కోహ్లీ తన పూర్వపు ఫామ్ త్వరలోనే అందుకుంటాడని తేల్చిచెప్పాడు.

అండగా నిలబడిన పాంటింగ్..

అండగా నిలబడిన పాంటింగ్..

గతంలో దాదాపు మూడేళ్ల పాటు కోహ్లీ ఫామ్‌లో లేడు. అప్పుడు కూడా పాంటింగ్ మాత్రం అతనికి మద్దతుగానే నిలిచాడు. కోహ్లీ ఒక ఛాంపియన్ ప్లేయర్ అని, అలాంటి వాళ్లు కచ్చితంగా తిరిగి ఫామ్ అందుకుంటారని చెప్పాడు. ఇప్పుడు కూడా అతను అదే విషయం చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ పెద్దగా రాణించని సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడిన కోహ్లీ.. మొత్తమ్మీద కేవలం 111 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు, అంతకుముందు 50పైగా ఉన్న అతని టెస్టు సగటు కూడా 48కి పడిపోయింది. దీంతో అతన్ని కూడా జట్టులో నుంచి తీసేయాలని కొందరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కోహ్లీకి కూడా తెలుసు..

కోహ్లీకి కూడా తెలుసు..

అయితే వీళ్లందరికీ భిన్నంగా పాంటింగ్ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. కచ్చితంగా అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వచ్చినట్లే.. టెస్టుల్లోనూ ఫామ్ అందుకుంటాడని స్పష్టం చేశాడు. 'కోహ్లీ విషయంలో నేను ఎప్పటి నుంచో ఒకటే మాట చెప్తున్నా. అతని వంటి ఛాంపియన్ ప్లేయర్లు ఎలాగోలా మళ్లీ గాడిలో పడతారు.

ప్రస్తుతానికి కొంచెం కరువులో ఉండొచ్చు. అతను పరుగులు చేయాలని మనం అంతా అనుకుంటాం. కానీ అతను చెయ్యలేకపోవచ్చు. కానీ కోహ్లీ కూడా రియలిస్టే. ఒక బ్యాటర్ పరుగులు చేయలేకపోతుంటే.. అతనికి కూడా విషయం అర్థం అవుతుంది. అందుకే ప్రస్తుతం పరుగులు లేకపోవడం గురించి నేను పెద్దగా పట్టించుకోను. అతను త్వరలోనే భారీ స్కోర్లు చేస్తాడని నా నమ్మకం' అని పాంటింగ్ తేల్చేశాడు.

బ్యాటర్లకు పీడకలలే..

బ్యాటర్లకు పీడకలలే..

అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లలోని బ్యాటర్లు అంత గొప్ప ఫామ్ చూపించడం లేదు. ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. దీనిపై కూడా పాంటింగ్ మాట్లాడాడు. 'ఈ సిరీస్‌లో ఎవరి ఫామ్ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే ఈ పిచ్‌లు బ్యాటర్లకు పీడకలలు. మొదటి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత మూడోది గెలవడానికి ఆసీస్ అద్భుతంగా పుంజుకుంది. ఈ పిచ్‌లపై బ్యాటింగ్ ఎంత కష్టంగా ఉందో మనకు కనిపిస్తూనే ఉంది.

ఇది జస్ట్ కొంచెం టర్న్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిన సమస్య కాదు. ఈ పిచ్‌లపై బౌన్స్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియడం లేదు. దీంతో ప్రతి బంతికీ బ్యాటర్లు గెస్ చేస్తూ ఉండాల్సి వస్తోంది. దీంతో పిచ్‌పై బ్యాటర్లకు నమ్మకం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు' అని పాంటింగ్ వివరించాడు.

Story first published: Monday, March 6, 2023, 17:44 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+