INDvsAUS : భారత్ ఆ సంగతి మర్చిపోయినట్లుంది.. ఇండోర్ పిచ్‌పై ఆసీస్ లెజెండ్ చురకలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తయారు చేస్తున్న పిచ్‌లపై మరోసారి చర్చ మొదలైంది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు చాలా సహకారం అందించింది. దానికితోడు ఒక ప్యాటర్న్ లేని బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఇంత భయంకరమైన స్పిన్ పిచ్‌లు తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు.

తప్పు సరిద్దుకోవాలి..
అలాగే మూడో టెస్టులో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ గురించి కూడా మాట్లాడాడు. తొలి టెస్టులో ఆసీస్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. 'నాగ్‌పూర్ టెస్టులో ట్రావిస్ హెడ్‌ను పక్కన పెట్టడం వెర్రి పని. అది నాన్ సెలెక్షన్ స్టుపిడిటీ. అయితే ఆ తర్వాత కనీసం తమ పొరపాటు గుర్తించి తప్పు సరిదిద్దుకున్నారు. భారత్ కూడా తమ విధానాల్లో పొరపాటును గుర్తించాలి. అదే వాళ్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేసుకోవడం. ఈ తప్పును కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది' అని ఛాపెల్ అన్నాడు.

ఆ సంగతి మర్చిపోయారా?
తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకుంది. అయితే తాము పన్నిన స్పిన్ ఉచ్చులో తామే పడ్డ టీమిండియా మూడో టెస్టులో దారుణంగా ఓడింది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. దీంతో అభిమానులు కూడా సంతోషంగా లేరు. దీనిపై మాట్లాడిన ఛాపెల్.. 'ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీసులు గెలిచామని వాళ్లు మర్చిపోయారా? క్యురేటర్ తప్ప మిగతా అడ్మినిస్ట్రేటర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు ఏం చేస్తున్నారు? పిచ్ ఎలా ఉండాలో వాళ్లు ఎందుకు చెప్తున్నారు?' అని ప్రశ్నించాడు.

ఫ్యాన్స్ కూడా అన్‌హ్యాపీ..
భారత్‌లో మరీ దారుణంగా స్పిన్ అయ్యే పిచ్‌లు తయారు చేస్తుండటంపై క్రీడాభిమానులు కూడా అంత సంతోషంగా లేరు. ఐదు రోజులకు టికెట్ కొనుక్కొని వస్తే మ్యాచులు కనీసం మూడు రోజులు కూడా జరగకపోవడంపై వాళ్లు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు అభిమానులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఫ్లకార్డులు పట్టుకున్నారు. 'నాలుగు, ఐదు రోజుల టికెట్లు ఎందుకు అమ్ముతున్నావ్ బీసీసీఐ? వాటిని అమ్మడం ఆపెయ్' అని రాసి ఉన్న ఆ ఫ్లకార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిదైన అహ్మదాబాద్ టెస్టులో అయినా పిచ్ మారుస్తారా? లేక అది కూడా ఇంతేనా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications