
క్యురేటర్ ఏం చేశాడంటే?
దీనికి కారణం ఏంటంటే.. తొలి టెస్టులో టీమిండియా స్పిన్‌కు ఆసీస్ బ్యాటర్లు బెంబేలెత్తారు. దీంతో రెండో టెస్టులో కూడా ఇలాంటి పిచ్‌పైనే ఆడాల్సి వస్తుందని ఆసీస్ వణికిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత నాగ్‌పూర్ పిచ్‌పై ప్రాక్టీస్ చేయాలని ఆస్ట్రేలియా జట్టు భావించింది. అయితే వాళ్ల ప్లాన్లను అక్కడి క్యురేటర్ చెడగొట్టాడు. పిచ్‌పై నీళ్లు పోసేశాడు. దీంతో ఆసీస్ జట్టు తమ ప్రాక్టీస్ ప్లాన్లకు నీళ్లు వదిలేయాల్సి వచ్చింది. దీనిపై ఇయాన్ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది సరైన పని కాదని, ఇలాంటి చర్యలు క్రికెట్‌కు చెడు చేస్తాయని మండిపడ్డాడు.

కఠిన చర్యలు తీసుకోవాలి..
'నాగ్‌పూర్ పిచ్‌పై ప్రాక్టీస్ చేయాలని వేసుకున్న ప్లాన్లు ఇలా చెడిపోవడం నిజంగా సిగ్గుచేటు. నాగ్‌పూర్‌లో జరిగిన పని క్రికెట్‌కు మంచిది కాదు. ఈ విషయంలో ఐసీసీ ముందుకొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తామని అభ్యర్థించిన తర్వాత పిచ్‌పై ఎలాంటి సమాచారం లేకుండా నీళ్లు పోసేయడం చాలా దారుణమైన చర్య. ఇలాంటి పనులు చేయడం సభ్యత కాదు' అని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా పిచ్‌పై నీళ్లు పోయడంతో ఆస్ట్రేలియా టీం.. ప్రాక్టీస్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది.

సరదా కోసం కాదు..
అంతకుముందు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా దీనిపై స్పందించాడు. ఇక్కడి తీవ్రమైన పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ ప్రాక్టీస్ సెషన్ ఒక అవకాశం అని భావించినట్లు మెక్‌డొనాల్డ్ చెప్పాడు. ఇదేం సరదా కోసం చేయాలని అనుకోలేదని అన్నాడు. 'వాళ్లు ఎలాంటి పిచ్‌లపై ఆడాలని అనుకుంటున్నారో క్లియర్‌గా కనిపిస్తోంది కదా. ఇదే పరిస్థితి తలెత్తుతుందని మేం అనుకున్నాం. అదే జరిగింది' అన్నాడు. అందుకే మరో టెస్టు ఆడే ముందు ఇలాంటి పిచ్‌పై ప్రాక్టీస్ చేయాలని అనుకున్నామని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications












