
మనం చేస్తే కరెక్టా?
'ఆస్ట్రేలియాలో సిరీస్ అంటే మొదటి మ్యాచ్‌ను మనం ఎప్పుడూ గబ్బాలో ప్రారంభిస్తాం ఎందుకు? అక్కడి బౌన్స్, పేస్‌తో ప్రత్యర్థిని మానసికంగా బలహీనం చేయడానికే కదా. అదే పని భారత్ చేస్తే తప్పు అని ఎందుకు అంటున్నారు? అది వాళ్ల తెలివైన స్ట్రాటజీ. దాన్ని తప్పుపట్టకూడదు. అక్కడకు వెళ్లే ముందే భారత్‌లో పిచ్‌లు ఎలా ఉంటాయో మనకు తెలుసు.
వాటిపై ఎలా ఆడాలో ఒక వ్యూహంతో వెళ్లాలి కానీ ఇలాగా ఆడేది?' అని తమ సొంత జట్టుపై మండిపడ్డాడు. ముఖ్యంగా రెండో టెస్టులో ఆసీస్ బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి అవుటవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వాళ్ల దగ్గర నేర్చుకోండి..
'ఎవరైనా ఇలా ఒక్క షాట్‌ను నమ్ముకుంటారా? స్వీప్ షాట్‌ను పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించే బెస్ట్ బ్యాటర్ మాథ్యూ హేడెన్. అతనే ప్రతి బంతికీ ఈ షాట్ ఆడకూడదని చెప్తున్నాడు కదా. మనం 80 నాటౌట్‌గా ఉన్నప్పుడు స్వీప్ ఆడితే ఓకే కానీ.. 8 పరుగులు కూడా చెయ్యకుండా ఆడితే ఎలా?' అని నిలదీశాడు.
అక్కడితో ఆగకుండా 'కామెంటరీ పనిమీద మాథ్యూ హేడెన్, మార్క్ వా ఇద్దరూ భారత్‌లో ఉన్నారు కదా. వాళ్లను నెట్ ప్రాక్టీస్‌కి పిలిపించి, సలహాలు తీసుకోవచ్చుగా. దాని కోసం వాళ్లకు పేమెంట్ కావాలంటే ఇవ్వడానికి ఏమైంది?' అని క్లార్క్ అడిగాడు.

హేడెన్ బంపరాఫర్..
అయితే కొన్ని రోజుల క్రితం ఆసీస్ మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఆ దేశ జట్టుకు బంపరాఫర్ ఇచ్చాడు. ఆసీస్ జట్టుకు తాను బ్యాటింగ్ సలహాలు ఇస్తానని, తనకు ఎలాంటి ఫీజు కూడా అక్కర్లేదని చెప్పాడు. ప్రాక్టీస్‌కు తనను కూడా తీసుకెళ్తే చాలని, తాను బ్యాటింగ్ మెళకువలు చెప్తానని హేడెన్ ఆఫర్ ఇచ్చాడు. కానీ దీనిపై ఆసీస్ టీం మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సుమారు ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు స్వీప్ లేదా రివర్స్ స్వీప్ ఆడబోయి అవుటయ్యారు. ఇది చూసిన చాలా మంది మాజీలు ఆస్ట్రేలియా ఆటతీరుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
