Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: బుమ్రాతో వాగ్వాదానికి దిగిన ఆసీస్ ఆటగాడు సామ్ కోన్ స్టాస్ ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ 185 పరుగులకే అలౌట్ అయింది. భారత ఆటగాళ్లో రిషబ్ పంత్ 40 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా 26, గిల్ 20 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు తీయగా.. స్టార్క్ 3, కమ్మిన్స్ 2, లయన్ ఒక వికెట్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే ఆసీస్ ఓపెనర్ సామ్ కోన్ స్టాస్ భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు.

కోన్ స్టాస్ భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వాగుతూనే ఉన్నాడు. ఇరిటేషన్ తెప్పించే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బ్యాటింగ్ మొదలు పెట్టినప్పుడు అతను దూకుడుగా ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి బంతినే కోన్ స్టాస్ బౌండరీ తరలించాడు. ఈ క్రమంలోనే
బుమ్రా మూడో ఓవర్ బౌలింగ్ వేశాడు. నాలుగు బాల్స్ పూర్తి అయ్యాయి. ఐదో బంతి వేసేందుకు సిద్ధం కాగా. . స్ట్రైకింగ్ చేస్తున్న ఖవాజా పక్కకు జరిగాడు.

Aussie batsman Sam Konstas got into an argument with Indian captain Jasprit Bumrah

దీంతో బుమ్రా ఏమైంది అంటూ.. వెనక్కు వెళ్లి బౌలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కోన్ స్టాన్ ఏదో అన్నాడు. దీంతో బుమ్రా వెనక్కు దిరిగి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కోన్ స్టాస్ కూడా మాట్లాడడంతో మాటమాట పెరిగింది. ఈ క్రమంలోనే ఎంపైర్ జోక్యం చేసుకున్నాడు. దీంతో గొడవ సర్దుకుంది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి బుమ్రా ఖవాజాను ఔట్ చేశాడు. అతను స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టాడు. దీంతో భారత ఆటగాళ్లు, స్పెషల్లీ బుమ్రా కోన్ స్టాస్ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నారు.

కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. శనివారం భారత బౌలర్లు ఆసీస్ ను 150 పరుగుల లోపు అలౌట్ చేస్తే మ్యాచ్ పై పట్టుబిగించే అవకాశం ఉంది. లేకుంటే ఈ మ్యాచ్ కూడా చేయిజారిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారా అనే సందేహాలు వస్తున్నాయి.

Story first published: Friday, January 3, 2025, 17:00 [IST]
Other articles published on Jan 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+