ఏ ఫార్మట్‌లోనైనా..
అలాంటి జింబాబ్వే.. ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. మేటి జట్టు ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను మూడు ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వే జట్టు సాధించిన మొట్టమొదటి విజయం ఇది. ఏ ఫార్మట్‌లో అయినా ఇదే తొలి గెలుపు. టెస్టుల్లో గానీ, వన్డే ఇంటర్నేషనల్స్ గానీ, టీ20ల్లో గానీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టును జింబాబ్వే ఓడించిన సందర్భాలు లేవు. తాజాగా ఆ కొరతను భర్తీ చేసుకుంది.

మూడు వికెట్ల తేడాతో..
ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఓడింది. మూడో వన్డేలో మాత్రం విజృంభించింది. తన ప్రధాన బలమైన బౌలింగ్‌లో రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 141 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఏడు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 142 పరుగులతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.
ర్యాన్ బర్ల్ స్పిన్ మాయాజాలం..
జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్- అయిదు వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరగ్గొట్టాడు. మూడే మూడు ఓవర్లు విసిరిన ర్యాన్ బర్ల్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను నేలకూల్చాడు. అతని బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒక్క ఫోర్, ఒక్క సిక్స్ గానీ కొట్టలేకపోయారంటే లెగ్ స్పిన్ మేజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వికెట్లు తీసుకున్నాడు.

స్పాన్సరర్లు లేక..
15 నెలలుగా ర్యాన్ బర్ల్‌కు స్పాన్సరర్లు లేరు. అలాగనీ- సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనే స్థోమతా అతనికి లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికీ డబ్బుల్లేని దుస్థితిని ఎదుర్కొంటోన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ర్యాన్ బర్ల్.. ఆస్ట్రేలియాపై చెలరేగాడు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్‌ను పేకమేడలా కుప్పకూల్చాడు. మూడు ఓవర్లల్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను తీసుకున్నాడు ర్యాన్.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్..
ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో అయిదు వికెట్లను తీసుకోవడంతో పాటు మూడు క్యాచ్‌లు పట్టాడు. ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 11 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. ఈ విజయం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపిందని, టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌కు ముందు ఇలాంటి విజయాన్ని అందుకోవడం మాటలు కాదని చెప్పాడు. ఆస్ట్రేలియాలపై ఆస్ట్రేలియాలో గెలవడం కంటే మంచి బ్యాటింగ్ ప్రిపరేషన్ ఉండబోదని వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications
