Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH ప్లేయర్ దెబ్బకు గ్రౌండ్ షేక్.. వైట్ జెర్సీ లో ఐపీఎల్ ప్రిపరేషన్!

శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ ట్రావిస్‌ హెడ్‌ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి శుభారంభం అందించాడు. హాఫ్ సెంచరీ బాది తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ కు ఆస్ట్రేలియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తుది పోరులో దక్షిణాఫ్రికాతో పోటీ పడనుంది. అయితే అంతకన్నా ముందు శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. అందులో భాగంగానే తాజాగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్‌ నెగ్గిన ఆసీస్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా దిగిన ఉస్మాన్‌ ఖవాజా - ట్రవిస్‌ హెడ్‌ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శన చేశారు.

Aus VS SL 1st Test Sunrisers Hyderabad Travis Head Explosive knock with super fast half century

తొలి ఓవర్ లోనే మూడు బౌండరీలు
హెడ్ తొలి ఓవర్ లోనే మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శించిన అతడు బంతిని బౌండరీలు బాదుతూ.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న ట్రవిస్‌ హెడ్‌.. 10 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 57 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. లంక స్పిన్నర్‌ ప్రబాత్‌ జయసూర్య బౌలింగ్‌లో చండీమాల్‌కు క్యాచ్‌కు ఇచ్చి వెనుదిరిగాడు.

వైట్ జెర్సీలో ఐపీఎల్ ట్రైనింగ్
హెడ్‌ ప్రదర్శనను చూసిన క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహాలో వీరబాదుడు బాదుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. వైట్ జెర్సీలో హెడ్ ఐపీఎల్ ట్రైనింగ్ మొదలుపెట్టేశాడంటూ మరో అభిమాని కామెంట్స్ చేశారు.

ఇక ఇదే మ్యాచ్ లో మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

Story first published: Wednesday, January 29, 2025, 13:29 [IST]
Other articles published on Jan 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+