Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SCO: ఇంగ్లిస్ విధ్వంసకర శతకం.. ఆస్ట్రేలియా ఘన విజయం

స్కాట్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. గ్రేంజ్ క్రికెట్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ ఇంగ్లిస్ (103; 49 బంతుల్లో, 7 ఫోర్లు, 7 సిక్సర్లు) రికార్డు శతకంతో విరుచుకుపడ్డాడు.

మొదట బ్యాటింగ్ చేసిస ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవరల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అయితే ఆసీస్‌కు పేలవారంభం దక్కింది. గత మ్యాచ్ హీరో ట్రావిస్ హెడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (16; 16 బంతుల్లో, 3 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. దీంతో 23 పరుగులకే ఓపెనర్లు వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కామెరూన్ గ్రీన్‌ (36; 29 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్‌డౌన్‌లో వచ్చిన ఇంగ్లిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

AUS vs SCO Josh Inglis Shines with Century as Bowlers Dominate to Clinch Series

ఇంగ్లిస్-గ్రీన్ కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రీన్ నిలకడగా ఆడగా గ్రీన్ బౌండరీలతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 43 బంతుల్లో శతకం అందుకున్న ఇంగ్లిస్ రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియన్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా ఇంగ్లిస్ పేరిటే ఉంది. అయితే అది ఫించ్ (47 బంతుల్లో)తో కలిసి ఉమ్మడిగా ఉంది. ఈ సారి గత రికార్డును బద్దలుకొట్టాడు.

కాగా, అనంతరం ఛేదనలో స్కాట్లాండ్ 16.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (59; 42 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జార్జ్ మున్సె (19; 9 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. స్టొయినిస్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. గ్రీన్ రెండు, జేవియర్, హార్డీ, అబాట్, జంపా తలో వికెట్ తీశారు. ఇక సిరీస్‌లో నామమాత్రపు ఆఖరి టీ20 శనివారం సాయంత్రం 6.30 గంటలకు జరగనుంది.

Story first published: Saturday, September 7, 2024, 9:37 [IST]
Other articles published on Sep 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+