Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్

స్కాట్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌ స్వీప్ చేసింది. గ్రేంజ్ క్రికెట్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కామెరూన్ గ్రీన్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటాడు. 39 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు.

రెండు ఫోర్లు, అయిదు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై గ్రీన్ విరుచుకుపడ్డాడు.అంతేగాక అంతకుముందు బంతితోనూ చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (56; 39 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు.

AUS vs SCO Cameron Green s All-Round Brilliance Secures Australia s 3-0 Sweep Against Scotland

ఓపెనర్ మున్సె (25; 17 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్ మూడు వికెట్లు, ఆరోన్ హార్డీ, అబాట్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 16.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గ్రీన్ అర్ధశతకంతో చెలరేగాడు.

కెప్టెన్ మిచెల్ మార్ష్ (31; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (25; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని మరోసారి డకౌటయ్యాడు. తొలి టీ20లోనూ ఫ్రేజర్ డకౌటైన విషయం తెలిసిందే. రెండో టీ20లో 16 పరుగులే చేశాడు. డేవిడ్ వార్నర్ వారసుడిగా వచ్చిన ఫ్రేజర్ తన అరంగేట్ర టీ20 సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. కాగా, స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ రెండు, క్రిస్టోఫర్, జాక్ జేర్విస్ చెరో వికెట్ తీశారు.

Story first published: Sunday, September 8, 2024, 8:03 [IST]
Other articles published on Sep 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+