స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. ఇక ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిపి టీ20ల్లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు చేసిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలోనే ఛేదించింది.
అయితే ట్రావిస్ హెడ్ (80; 25 బంతుల్లో, 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (39; 12 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసంతో ఆసీస్ పవర్‌ప్లేలో ఏకంగా 113 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పవర్‌ప్లే సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా (113/1- స్కాట్లాండ్‌పై), సౌతాఫ్రికా (102/0- వెస్టిండీస్‌పై), వెస్టిండీస్ (98/4- శ్రీలంకపై) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇక ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిపితే ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ప్లేలో 125 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ (89; 32 బంతుల్లో, 11 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (46; 12 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఊచకోతకు దిగారు.
ఇక స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సె (28; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో అబాట్ మూడు, జేవియర్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 9.3 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది.
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడటంతో ఆసీస్ 5.3 ఓవర్లలోనే మూడంకెల స్కోరు అందుకుంది. వీరిద్దరు కలిసి వరుసగా 14 బౌండరీలు బాదడం విశేషం. జోష్ ఇంగ్లిష్ (27 నాటౌట్; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మూడు బంతుల్ని ఎదుర్కొని డకౌటయ్యాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ రెండు వికెట్లు పడగొట్టాడు.