Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: తేలిపోయిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం!!

AUS vs SA: Aiden Markram 40 Runs helps South Africa scores 118/9 vs Australia.

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 చేసి.. ఆసీస్ ముందు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ (40) ఒక్కడే పోరాడాడు. 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ బావుమా (12), స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ (7) పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌, పాట్ కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. ప్రోటీన్ ఓపెనర్లు క్వింటన్ డికాక్ (7: 12 బంతుల్లో 1x4), తెంబా బవుమా (12: 7 బంతుల్లో 2x4) పేలవరీతిలో వికెట్లు చేజార్చుకున్నారు. ఆపై వాన్ డెర్ డ్యూసెన్ కూడా విఫలమయ్యాడు. స్టార్ బ్యాటర్ డ్యూసెన్ మూడు బంతులల్లో 2 రన్స్ చేశాడు. ఈ సమయంలో ఐడెన్ మార్క్రామ్ జట్టును ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (13: 13 బంతుల్లో 2x4) అండతో మార్క్రామ్ పరుగులు చేశాడు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు కదిలింది.

అయితే ఒకవైపు మార్క్రామ్ పోరాడుతున్నా.. డేవిడ్ మిల్లర్ (16: 18 బంతుల్లో), ప్రిటోరియస్ (1) తక్కువ స్కోరుకే ఔటవడంతో దక్షిణాఫ్రికా కనీసం 100 పరుగుల మార్కుని కూడా చేరేలా కనిపించలేదు. కానీ చివర్లలలో పట్టుదలతో క్రీజులో నిలిచిన పేస్ బౌలర్ కాగిసో రబాడ.. దక్షిణాఫ్రికా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అతడు ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్ కూడా కొట్టడం విశేషం. రబాడ బ్యాట్ జులిపించడంతో ప్రొటీస్ స్కోర్ 100 దాటింది. మొత్తంగా సఫారీ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. టీ20 ప్రపంచకప్‌ 2021లోని మొదటి మ్యాచే అభిమానులను నిరాశపరిచింది.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా (కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, రాసీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, తబ్రేజ్ షమ్సీ.
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

Story first published: Saturday, October 23, 2021, 18:13 [IST]
Other articles published on Oct 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+