Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: ఒరెయ్ రిజ్వాన్..ఇంత వెధవ్వేంట్రా! ప్రత్యర్థిని అడిగి రివ్యూకి వెళ్తారా? (Video)

ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ప్రత్యర్థిని సమీక్షకు వెళ్లిన రిజ్వాన్.. థర్డ్ అంపైర్ నిర్ణయం చూసి నోరెళ్లబెట్టాడు. మరోవైపు రిజ్వాన్ తెలివి తక్కువ పనిని చూసి వ్యాఖ్యాతలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.

అసలేం జరిగిందంటే.. 34వ ఓవర్‌లో నసీమ్ షా వేసిన బౌన్సర్‌ను ఆడమ్ జంపా షాట్‌కు ప్రయత్నించాడు.కానీ అది మిస్ అయ్యింది. అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అయితే అది ఔట్ అంటూ పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అపీల్ చేశాడు. రిజ్వాన్ కాకుండా మరే ఇతర పాక్ ఆటగాడు అంత నమ్మకంతో అపీల్ చేయలేదు.

AUS vs PAK Rizwan Tricked by Zampa into Losing Review Stump Mic Captures Hilarious Exchange

'నీకు ఏమైనా వినపడిందా...' అంటూ రిజ్వాన్ బౌలర్ దిశగా నడుస్తూ జంపాను అడిగాడు. దానికి 'నువ్వు అన్నింటికి అపీల్ చేస్తున్నావ్?' అని జంపా బదులిచ్చాడు. 'అయితే దీనికి రివ్యూ తీసుకోమంటావా' అని రిజ్వాన్ అడిగాడు. తనకి పోయేంది ఏముంది అన్నట్లుగా జంపా.. 'హ, నువ్వు తీసుకోవచ్చు' అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత రిజ్వాన్ రివ్యూని కోరాడు. ఆ బంతిని సమీక్షించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో పాకిస్థాన్ ఓ రివ్యూ కోల్పోయింది. రిజ్వాన్ నోరెళ్లబెట్టాడు.

కాగా, రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా (18; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ (35; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. పాకిస్థాన్ బౌలర్లలో హారిష్ రవూఫ్ అయిదు వికెట్లు, షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా ఒక్క వికెట్ తీశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడిచేసింది.

Story first published: Friday, November 8, 2024, 12:36 [IST]
Other articles published on Nov 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+