For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs PAK: కమిన్స్‌కు పాక్ క్రికెటర్ కవ్వింపులు..తర్వాతి బంతికే వికెట్!(Video)

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలోనే 203 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (44; 71 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆఖర్లో నసీమ్ షా (40; 39 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) కీలక పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కమిన్స్, జంపా చెరో రెండు, అబాట్, లబుషేన్ తలో ఒక్క వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. సయిమ్ అయుబ్ (1; 5 బంతుల్లో), అబ్దుల్లా షఫికి (12; 26 బంతుల్లో, 1 ఫోర్)లను స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్‌తో కలిసి బాబర్ అజామ్ (37; 44 బంతుల్లో, 4 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ బాబర్‌ను జంపా బోల్తా కొట్టించాడు.

అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ కాస్త భిన్నంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాడు. స్టీవ్ స్మిత్‌ను అనుకరిస్తూ కమిన్స్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అంతేగాక కమిన్స్‌ను కవ్వించాడు. కమిన్స్ వేసిన 19వ ఓవర్ అయిదో బంతిని గులామ్ సమర్థవంతంగా డిఫెండ్ చేశాడు. అనంతరం 'వెయిట్ ఆన్' అంటూ స్మిత్ స్టైల్‌లో కమిన్స్‌కు బ్యాటు చూపిస్తూ డైలాగ్ చెప్పాడు.

వన్డే అరంగేట్రంలోనే అతి చేస్తున్న కమ్రాన్ గులామ్‌ను తర్వాతి బంతికే కమిన్స్ బోల్తాకొట్టించాడు. కమిన్స్ వేసిన బౌన్సర్‌ను డిఫెండ్ చేయడంలో విఫలమై వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. 29 ఏళ్ల కమ్రాన్ గులామ్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో బాబర్ అజామ్ స్థానంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు.

కానీ రెండో మ్యాచ్‌లో మూడు పరుగులకే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన కమ్రాన్ వన్డేల్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ టెస్టు తరహాలోనే శుభారంభం అందుకోలేకపోయాడు. కాగా, 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. జోష్ ఇంగ్లిస్ (49; 42 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (44; 46 బంతుల్లో, 6 ఫోర్లు) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు వికెట్లు, షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు తీశారు.

AUS vs PAK Kamran Ghulam Mocks Pat Cummins with Steve Smith Impression Falls Next Ball Watch
Story first published: Monday, November 4, 2024, 15:13 [IST]
Other articles published on Nov 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+