Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డే నైట్ టెస్టులో సెహ్వాగ్ రికార్డు సమం: ఆసీస్ ఓపెనర్లు సెంచరీలు, డే1-302/1

 AUS vs PAK, D/N Test: David Warner breaks Virender Sehwags tally with 23rd century as opener

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగారు. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు తొలి రోజున ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో డేవిడ్ వార్నర్‌కు ఇది 23వ సెంచరీ. ఈ క్రమంలో ఓపెనర్‌గా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(23) సెంచరీలను సమం చేశాడు.

ఓపెనర్‌గా రెండో స్థానంలో డేవిడ్ వార్నర్

మరోవైపు ఆస్ట్రేలియా తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో డేవిడ్ వార్నర్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ ఓపనర్ మాథ్యూ హేడెన్‌(30) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... డేవిడ్ వార్నర్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరిస్‌లో విఫలమైన వార్నర్ సొంతగడ్డపై పాక్‌తో జరుగుతున్న సిరిస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జో బర్న్స్‌లు ఇన్నింగ్స్‌‌ను ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 8 పరుగు వద్ద జో బర్న్స్‌(4) షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మహ్మద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో మ్యాచ్ అరంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది.

రెండో వికెట్‌కు 294 పరుగుల భాగస్వామ్యం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లాబుస్చాగ్నేతో కలిసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్కోరు బోర్డుని నడిపించాడు. తొలుత హాఫ్‌ సెంచరీ సాధించిన వార్నర్ ఆ తర్వాత దానిని సెంచరీగా మలిచాడు. ఆ తర్వాత లాబుస్చాగ్నే సైతం సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 294 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 73 ఓవర్లకు గాను 302 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(166), మార్నస్ లాబుస్చాగ్నే(126) పరుగులతో ఉన్నారు. కాగా, బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా వీరిద్దరూ సెంచరీలతో మెరిసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 29, 2019, 18:04 [IST]
Other articles published on Nov 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+