For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs OMAN: స్టొయినిస్ విధ్వంసం.. ఆస్ట్రేలియా ఘన విజయం

టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ స్వరూపాన్ని, బంతితో మ్యాచ్ గమనాన్ని మార్చిన మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), (3-0-19-3)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), స్టొయినిస్ అర్ధశతకాలు సాధించారు. మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అయితే ఆసీస్ ఇన్సింగ్స్ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది. 12 ఓవర్లకు 63/3 స్కోరు మాత్రమే సాధించింది. ఆ తర్వాత స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

AUS vs OMAN Marcus Stoinis All-Round Performance Leads Australia to Victory

బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. మెహ్రన్ ఖాన్ వేసిన 15వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. మరో ఎండ్‌లో వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ అతనికి సహకరించాడు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. స్టొయినిస్-వార్నర్ నాలుగో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వీరిద్దరి ధాటికి చివిర 8 ఓవర్లలో ఆసీస్ 101 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. స్టొయినిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, ఎలిస్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆది నుంచి క్రమంగా వికెట్లు కోల్పోయింది. 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో వచ్చిన మెహ్రన్ ఖాన్ (27; 16 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి అయాన్ ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

Story first published: Thursday, June 6, 2024, 10:23 [IST]
Other articles published on Jun 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+