ఆసీస్ టెస్ట్ జట్టులో యువ కెరటాలు: పుకోవ్‌స్కీ.. కళ్లు తిరిగే యావరేజ్

మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా.. టెస్టు జట్టును ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుతో సొంతగడ్డ మీద తలపడబోయే 17 మందితో కూడిన టెస్టు జట్టును కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్న యువ కెరటాలకు చోటు కల్పించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొనసాగుతోన్న షెఫర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌ను ప్రాతిపదికగా తీసుకుని.. కొత్త ముఖాలకు బెర్త్ కన్‌ఫర్మ్ చేసింది. సీనియర్లు, జూనియర్లతో జట్టులో సమతౌల్యాన్ని సాధించినట్టే కనిపిస్తోంది.. క్రికెట్ ఆస్ట్రేలియా.

కొత్త జట్టుతో
భారత్ క్రికెట్ జట్టు.. రెండున్నర నెలల పాటు ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనను చేపట్టబోతోంది. ఈ నెల చివరిలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభం కాబోతోంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోంది. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్లలో ఆడబోయే జట్టును ఇదివరకే ప్రకటింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. తాజాగా టెస్టు టీమ్‌ను వెల్లడించింది. ఈ టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 17వ తేదీన ప్రారంభం కానుంది.

247 యావరేజ్..
తొలి టెస్ట్ వచ్చేనెల 17వ తేదీనన ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కు అడిలైడ్ వేదిక కానుంది. అక్కడి నుంచి వరుసగా టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. తాజాగా- టెస్టుల్లో భారత జట్టును ఢీ కొనబోయే స్క్వాడ్ పేర్లను వెల్లడించింది. విల్ పుకోవ్‌స్కీ, కామెరాన్ గ్రీన్‌లకు చోటు కల్పించింది. 21 సంవత్సరాల కామెరాన్ గ్రీన్, 22 ఏళ్ల పుకోవ్‌స్కీ.. షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో పుకోవ్‌స్కీ కళ్లు చెదిరే యావరేజ్‌ను నమోదు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్.. 247.5.

కొత్త లెగ్ స్పిన్నర్..
ఈ టోర్నమెంట్‌లో 495 పరుగులు చేశాడతను. టోర్నమెంట్ టాప్ స్కోరర్ అతనే. వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతోన్న కామెరాన్ గ్రీన్.. 363 పరుగులు చేశాడు. 72.6 యావరేజ్‌ను సాధించాడు. వారిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మిఛెల్ స్వెప్‌సన్‌ను టెస్టుల కోసం ఎంపిక చేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ ట్రెవర్ తెలిపారు. షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో స్వెప్‌సన్ 23 వికెట్లను పడగొట్టాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు.

ఇదీ టీమ్..
టెస్ట్ టీమ్ ఇదీ.. షాన్ అబాట్, జో బర్న్స్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, మార్నుస్ లంబుషెన్, నాథన్ లియాన్, మిఛెల్ నీసర్, టిమ్ పెయిన్, జామ్స్ పాటిన్సన్, విల్ పుకోవ్‌స్కీ, స్టీవ్ స్మిత్, మిఛెల్ స్టార్క్, మిఛెల్ స్వెప్‌సెన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్. తొలి టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 (మెల్‌బోర్న్), మూడో టెస్ట్ జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్)న సాగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications