AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీలో మరో రసవత్తర పోరు జరుగుతోంది. గ్రూప్-బి బలమైన జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు లాహోర్ వేదికగా అమీ తుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లీష్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. బ్యాటింగ్ కు మొదలు పెట్టిన ఇంగ్లండ్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇంగ్లండ్ 5.2 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్ లోనే ఇంగ్లీష్ పవర్ హిట్టర్, ఓపెనర్ ఫిల్ సాల్ట్(10) వెనుదిరిగాడు. మిడ్-ఆన్ లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ కేరీ పక్షిలాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకుని సాల్ట్ కు షాకిచ్చాడు. ఈ క్యాచ్ గ్రేటెస్ట్ క్యాచ్ లలో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వావ్ వాట్ ఏ క్యాచ్ కేరీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అనంతరం ఆరో ఓవర్ లో జేమీ స్మిత్ క్యాచ్ ను కూడా అతడే పట్టడం విశేషం. ఈ రెండు వికెట్లు ఆసీస్ బౌలర్ బెన్ డ్వారిషూస్ కే పడడం గమనార్హం.

ఆస్ట్రేలియా తుది జట్టు :
మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
ఇంగ్లాండ్ తుది జట్టు :
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్