Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొదమసింహాల పోరు - ముందే వచ్చిన టీ20 ప్రపంచకప్ ఫైనల్..!!

Big match in T20 World Cup 2022 as England to take Australia today.

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో సంచలనాలు నమోదవుతోన్నాయి. చిన్న జట్లు పంజా విసురుతున్నాయి. మొన్నటికి మొన్న ఐర్లాండ్- తన కంటే ఎంతబలమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలోనే అయినప్పటికీ- వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి.. ఆ లక్ష్యానికి ఆమడదూరంలో ఇంగ్లాండ్‌ను ఉంచగలిగింది ఐర్లాండ్. అలాంటి ఫలితాలు వెలువడే అవకాశాలు లేకపోలేదు.

 ఇవ్వాళ రెండు..

ఇవ్వాళ రెండు..

ఇవ్వాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్- ఐర్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ రెండింటికీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి మ్యాచ్‌ ఉదయం 9:30 గంటలకు ఆరంభమౌతుంది. ఇంగ్లాండ్‌ను ఓడించిన ఐర్లాండ్.. ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఐర్లాండ్ గెలిస్తే- మరో సంచలనమే అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నేరుగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. ఐర్లాండ్ గ్రూప్స్ ఆడి మరీ సూపర్ 12లో ఎంట్రీ ఇవ్వడమే దీనికి కారణం.

 హాట్ ఫేవరెట్స్ మధ్య..

హాట్ ఫేవరెట్స్ మధ్య..

ఐర్లాండ్ చేతిలో పరాజయాన్ని చవి చూసిన ఇంగ్లాండ్ మరో కీలక మ్యాచ్‌ను ఆడటానికి సమాయత్తమౌతోంది. ఆస్ట్రేలియాలను ఢీ కొట్టబోతోంది. హైఓల్టేజ్ మ్యాచ్ ఇది. ఈ రెండు జట్లు కూడా టైటిల్ హాట్ ఫేవరేట్సే. ఫైనల్స్ ఈ రెండింటి మధ్యే ఉండబోతోందంటూ ఇదివరకే క్రికెట్ ఫెటర్నిటీస్ జోస్యం కూడా చెప్పారు. మాజీలు, ఇతర క్రికెట్ పండితుల అంచనాల్లో టాప్ ప్రయారిటీస్ ఉన్న జట్లు ఈ రెండే. వీటితో పాటు భారత్‌కూ ఫైనల్స్ చేరే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు వెలువడ్డాయి.

ఫైనల్స్ తరహాలో..

ఫైనల్స్ తరహాలో..

అలాంటి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఇక ఫైనల్స్‌ను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఈ రెండు జట్లకూ ఉంది. ప్రత్యేకించి- ఆసీస్‌కు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది ఆరోన్ ఫించ్ సేన. 89 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీనివల్ల నెట్ రన్‌రేట్‌ బాగా క్షీణించింది. దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఆస్ట్రేలియాకు ఉంది. గ్రూప్-1లో ఈ కంగారూ జట్టు అయిదో స్థానంలో ఉంది.

ఐర్లాండ్‌తో ఓడిన తరువాత..

ఐర్లాండ్‌తో ఓడిన తరువాత..

ఇంగ్లాండ్‌దీ అదే పరిస్థితి. ఐర్లాండ్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన తరువాత ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతోండటం అగ్నిపరీక్షగా మారిందా జట్టుకు. ఆస్ట్రేలియా కంటే ఫర్వాలేదనపించే స్థితిలో ఉన్నప్పటికీ.. దాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం టాప్-3లో ఉందీ ఇంగ్లీష్ జట్టు. ఈ మ్యాచ్‌లో ఓడితే దాని పరిస్థితి దిగజారుతుంది. సెమీ ఫైనల్స్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పని పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.

తుదిజట్టులో

తుదిజట్టులో

ఆస్ట్రేలియా తుదిజట్టులో- ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తుది జట్టులో- జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్ / ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ ఆడొచ్చు.

Story first published: Friday, October 28, 2022, 8:40 [IST]
Other articles published on Oct 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+