Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: మిచెల్ స్టార్క్ విధ్వంసం.. బంగ్లాదేశ్ చిత్తు చిత్తు!

AUS vs BAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మాకేలోని గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన విధ్వంసకర బౌలింగ్ దాడితో విరుచుకుపడటంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదటి టెస్టులో డార్విన్ వేదికగా అనూహ్య ఓటమిని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను 1-1తో సమం చేసింది.

ట్రోఫీలు గెలవడమే నా పని.. వారి అభిప్రాయాలు, ఇష్టాలు అక్కర్లేదు: గౌతమ్ గంభీర్

ట్రోఫీలు గెలవడమే నా పని.. వారి అభిప్రాయాలు, ఇష్టాలు అక్కర్లేదు: గౌతమ్ గంభీర్

ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడంలో స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ విభాగం నడ్డివిరిచిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే దాడిని కొనసాగించి మరో 4 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అద్భుతమైన స్పెల్స్ తో చెలరేగిన మిచెల్ స్టార్క్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' పురస్కారాలు లభించాయి.

AUS vs BAN 2nd Test Mitchell Starc 10 Wickets Lead Australia to Victory in Two Days Full Details

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. అందులో 11వ స్థానంలో వచ్చిన షోరిఫుల్ ఇస్లాం చేసిన 14 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్(67), స్టీవ్ స్మిత్(42) రాణించడంతో 210 పరుగులు చేసి 146 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లాదేశ్ హౌలర్ షోరిఫుల్ ఇస్లాం 7 వికెట్లతో పోరాడినా జట్టుకు మేలు జరగలేదు.

IND vs SL 2nd Test: రెండో టెస్టుకు స్టార్ క్రికెటర్ దూరం.. ఆల్‌రౌండర్ అరంగేట్రం!

Also Read

IND vs SL 2nd Test: రెండో టెస్టుకు స్టార్ క్రికెటర్ దూరం.. ఆల్‌రౌండర్ అరంగేట్రం!

మిచెల్ స్టార్క్ మెరుపు బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముష్ఫికుర్ రహీమ్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన తొమ్మిది మంది బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు, వారిలో ముగ్గురు ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియాన్ చెరో మూడు వికెట్లతో స్టార్క్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో రెండో రోజు టీ విరామం తర్వాత ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Story first published: Sunday, August 23, 2026, 13:09 [IST]
Other articles published on Aug 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+