ఆగస్టు 14: బ్రాడ్‌మన్ నిష్క్రమణ, సచిన్ పరిచయం ఒకేరోజు

హైదరాబాద్: ఆగస్టు 14... క్రికెట్ చరిత్రలో ఈరోజుకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓ దిగ్గజ ఆటగాడి శకం ముగియగా.. మరో దిగ్గజ ఆటగాడు ప్రస్థానం మొదలైంది. ఈ ఇద్దరిలో ఒకరు క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేయగా, మరొకరు క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకరు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ కాగా, మరొకరు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.
కాకతాళియమో లేక యాదృచికమో ఏమో తెలియదు గానీ బ్రాడ్‌మన్ వీడ్కోలు పలికిన ఆగస్టు 14నే సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. 1948 ఆగస్టు 14 ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్ జరిగింది. ఐదు టెస్టుల సిరీస్ అప్పటికే ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 52 పరుగులకే ఆలౌటైంది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు చక్కటి శుభారంబాన్ని అందించారు. 117 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత డాన్ బ్రాడ్‌మన్ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం వారి క్యాప్‌లను తీసి గౌరవ సూచకంగా స్వాగతం పలికారు.
బ్రాడ్‌మన్ కెరీర్‌లో చివరి మ్యాచ్
కెరీర్‌లో బ్రాడ్‌మన్ చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఎరిక్ హొల్లీస్ బౌలింగ్‌లో తొలి బంతి ఎదుర్కొన్న బ్రాడ్‌మన్ ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రేక్షకులక ఏమైందో అర్ధం కాలేదు. ఒక్కసారిగా మైదానమంతా మూగబోయింది. తన చివరి మ్యాచ్‌లో మరో 4 పరుగులు చేస్తే టెస్టుల్లో 100 సగటు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ గుర్తింపు పొందేవాడు. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు.

149 పరుగుల తేడాతో భారీ విజయం
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో సైతం 188 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 149 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం బ్రాడ్‌మన్‌కు రాలేదు. తన టెస్టు కెరీర్‌లో కేవలం 52 టెస్టులు మాత్రమే ఆడిన బ్రాడ్‌మన్ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సరిగ్గా 42 ఏళ్ల అనంతరం
సరిగ్గా 42 ఏళ్ల అనంతరం 1990, ఆగస్టు 14నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో సెంచరీని నమోదు చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన సచిన్ టెండూల్కర్ టీమిండియాను ఓటమి నుంచి గటెక్కించాడు. దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

109 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు కష్టాల్లో
డెవాన్ మెక్ కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఈ మ్యాచ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 పరుగులు చేసిన పెవిలియన్ చేరారు. ఇక, వెంగ్ సర్కార్ కూడా 32 పరుగులకే అవుటయ్యాడు. 109 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు.

కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు
11 పరుగులు చేసి కెప్టెన్ అజారుద్దీన్ అవుటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడంతో సచిన్‌కు లైఫ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి దూకుడుగా ఆుతూ 189 బంతులను ఎదుర్కొన్న సచిన్ టెండూల్కర్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 పరుగులతో మనోజ్ ప్రభాకర్ సచిన్‌కు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని
ఆ మ్యాచ్‌లో గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని సచిన్ బరిలో దిగిడం విశేషం. 17 ఏళ్ల 112 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డ మీద సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు సచినే కావడం విశేషం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ప్రపంచ క్రికెట్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు పాక్ క్రికెటర్ ముస్తాఖ్ మహ్మద్ గుర్తింపు పొందాడు. అతడు 17 ఏళ్ల 80 రోజుల వయసులో సెంచరీ నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications