బెంగళూరు: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తోపాటు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు భారత్‌కు ఒలింపిక్స్-2016లో తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ గర్వించేలా చేశావంటూ సెహ్వాగ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
రియో పతకం: 5రికార్డులు సృష్టించిన సాక్షి మాలిక్
ఒలింపిక్స్‌లో బుధవారం సాక్షి మాలిక్ మహిళల 58 కిలోల ప్రీస్టైల్ విభాగంలో 8-5 తేడాతో గెలుపొంది కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 24ఏళ్ల సాక్షి ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన 4వ క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది.
మిగితా ముగ్గురురిలో కరణం మల్లేశ్వరి(2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించింది), మేరీ కోమ్ (2012లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో కాంస్యం), సైనా నెహ్వాల్(2012లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం) ఉన్నారు.
కాగా, భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, ఇతర క్రికెటర్లు, క్రీడాకారులు, ప్రముఖులు సాక్షిని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇందులో సెహ్వాగ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు. వీరూ ట్వీట్‌కి 8వేల మంది రీట్వీట్ కూడా చేయడం గమనార్హం.
థాంక్యూ సాక్షి: 'శోభాడే చెంప చెళ్లుమనిపించావ్'
'మీరు ఒక ఆడి బిడ్డను చంపకుండా ఉంటే.. ఏం సాధిస్తుందో సాక్షి నిరూపించింది. మనం మన ఆడ బిడ్డను కాపాడుకుంటే.. ఆమె మన గౌరవాన్ని నిలబెడుతుంది. గర్వపడేలా చేస్తుంది' అని పేర్కొంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
సాక్షికి భారీ నజరానాలు
రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షిమాలిక్‌కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. భారత్‌కు తొలి పతకం సాధించినందుకు గాను సాక్షికి రూ.2.5కోట్ల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇతర అవార్డులు, గుర్తింపులు
ఇండియన్ రైల్వే తన ఉద్యోగిగా రూ. 50లక్షలు నజరానాగా ప్రకటించింది.
ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ రూ. 20లక్షలు
జెఎస్‌హెచ్ గ్రూప్ రూ. 15లక్షలు
సల్మాన్ ఖాన్ నుంచి రూ. 1.01 లక్షలు