Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతియా​ శెట్టి బర్త్​డే విషెస్​.. రిప్లై ఇవ్వ‌ని కేఎల్ రాహుల్!!

Athiya Shetty wishes KL Rahul: Happy birthday, my person

బెంగళూరు: భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్​ 28వ పడిలోకి అడుగుపెట్టాడు. శనివారం అతడి పుట్టినరోజు. పుట్టిన రోజు సంద‌ర్భంగా రాహుల్ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. టీమ్​టీమిండియా క్రికెటర్లతో పాటు ఐసీసీ కూడా శుభాకాంక్షలు తెలిపింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ గ‌ర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి అత‌నికి వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు తెలిపింది.

కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'హ్యాప్పీ బ‌ర్త్‌డే మై డియ‌ర్' అని కామెంటు పెట్టి ల‌వ్ ఎమోజీని అతియా శెట్టి యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ ఫోటోపై కామెంట్లు పెడుతున్నారు. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా, టైగర్ ష్రాఫ్ సోదరి తమదైన స్టయిల్లో కామెంట్ పెట్టారు. అయితే ఇంత‌కవ‌ర‌కు అతియా పోస్టుకు రాహుల్ ఎలాంటి రిప్లై ఇవ్వ‌లేదు.

గ‌త సంవ‌త్స‌రం అతియా శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్ప‌డంతో.. వీరిద్ద‌రి మధ్య ప్రేమ మొద‌లైంద‌ని అంతా అనుకున్నారు. ఆ వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తూ రాహుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ శెట్టి న‌టించిన 'హేరాపేరి' సినిమాలో అత్యంత పాపుల‌ర్ అయిన టెలిఫోన్ స‌న్నివేశాన్ని ఇమిటేట్ చేశాడు. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండ‌గా.. అతియా ఫోన్ ప‌క్క‌న నిలుచొని కాయిన్ వేస్తుంది. అప్పుడు రాహుల్ ఫోన్‌లో 'హ‌లో దేవీ ప్ర‌సాద్' అంటాడు. అప్ప‌ట్లో ఈ పోస్ట్ బాగా వైర‌ల్ అయింది.

సంవ‌త్సరం నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న రాహుల్‌, అతియాల పెళ్లి చేసుకుంటే.. మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు. లోకేష్ రాహుల్ భారత్ తరఫున 36 టెస్టులు, 32 వన్డేలు, 42 టీ20లు ఆడాడు. మరోవైపు 67 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. భారత్ తరఫున రెండు, ఐపీఎల్‌లో ఒక సెంచరీ చేసాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్​లో 221పరుగులు, మూడు వన్డేల సిరీస్​లో 204 పరుగులతో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు.

లోకేష్ రాహుల్​కు టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్​స్టాగ్రామ్ వేదికగా పాత ఫొటోను జతచేసి విష్ చేశాడు. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రదర్​మ్యాన్​. నిత్యం నీ మద్దతు పొందా' అని హార్దిక్ రాసుకొచ్చాడు. గతేడాది జనవరిలో 'కాఫీ విత్ కరణ్'​ షోలో పాల్గొన్న హార్దిక్​, రాహుల్​ మహిళలపై అభ్యంతరకమైన వ్యాఖలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి రాహుల్ అద్భుతంగా ఆడుతూ ప్రస్తుతం టీమ్​జట్టులో కీలక ప్లేయర్​గా మారాడు. మూడు ఫార్మాట్లలో శతకం చేసిన మూడో భారత బ్యాట్స్​మన్​గా రికార్డు సైతం సొంతం చేసుకున్నాడు. కేఎల్ రాహుల్​కు టీమ్​ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్​తో పాటు మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు.

Story first published: Saturday, April 18, 2020, 17:04 [IST]
Other articles published on Apr 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+