
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఓ బాలీవుడ్ నటితో డేటింగ్‌లో ఉన్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కేఎల్ రాహుల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి కొత్త ఏడాదిని ఘనంగా జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. థాయిలాండ్ బీచ్‌లో కేఎల్ రాహుల్ పరిగెత్తే ఫోటోతో పాటు అతియా శెట్టి బీచ్‌లో సేద తీరుతున్న ఫోటోలు తమ తమ ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ వ్యవహారం నడుస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అతియా శెట్టి 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన 'హీరో' సినిమాతో కథానాయికగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.