టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై షాకింగ్ వార్తలు బయటకు వచ్చాయి. అతను లండన్‌లో ఒక స్ట్రిప్ క్లబ్‌లో కనిపించాడనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన చాలా మంది ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన అతను ఇలాంటి పని చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా జరుగుతున్న ట్రోలింగ్‌పై రాహుల్ భార్య, బాలీవుడ్ మడల్ అతియా శెట్టి స్పందించింది. 'నేను సాధారణంగా సైలెంట్‌గానే ఉంటాను. దేని విషయంలో పెద్దగా స్పందించను. కానీ కొన్నిసార్లు మన కోసం మనం నిటారుగా నిలబడక తప్పదు. రాహుల్, నేను, మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడూ వెళ్లే చోటుకే వెళ్లాం. ఈ విషయాలను తప్పుదోవ పట్టించి, ఇష్టం వచ్చినట్లు రిపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు' అని ఆమె చెప్పింది.

ప్రస్తుతం రాహుల్ తన కుటుంబంతో కలిసి తన టైం ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్‌లో లక్నో సారధిగా ఉన్న అతను.. ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో అతను ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న అతను వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఆడటం లేదు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు.

కాగా, ఐపీఎల్ చివరి దశకు చేరుకున్న తరుణంలో భారత జట్టు సభ్యులు ఒకరొకరుగా ఇంగ్లండ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ సహా పలువురు కీలక ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఇంకా ఐపీఎల్ ఫైనల్ మిగిలే ఉండటంతో గుజరాత్, చెన్నై టీమ్స్‌లోని టీమిండియా ఆటగాళ్లు ఇంకా భారత్‌లోనే ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత వాళ్లు కూడా ఇంగ్లండ్ చేరుకుంటారు. ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ నెగ్గాలని భారత జట్టు పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే.