For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ గొప్ప ఆటగాడే, కానీ: లారాకు వార్న్ కితాబు

లండన్: తాను బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలకు బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశానని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్న వార్న్.. కొన్ని సమయాల్లో అతని కంటే లారానే ఉత్తమం అని తెలిపాడు.

తన జనరేషన్‌లో సచిన్ టెండూల్కర్ ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు వార్న్. మైదానంలో సచిన్, వార్న్‌లు చాలా సార్లు తలపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ కలిసి ప్రారంభించిన ఆల్ స్టార్స్ ట్వంటీ20 లీగ్‌లో రిటైరైన ఆటగాళ్లను గత సంవత్సరం మరోసారి మైదానంలోకి దించారు.

At times Brian Lara was better than Sachin Tendulkar, says Shane Warne

'నా తరంలో సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాట్‌మన్. ఒక అద్భుతమైన ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, ఎలాంటి బంతినైనా ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది. భారత్ నుంచి అతడు గొప్ప ఆటగాడు' అని స్కైస్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తెలిపాడు.

9దేశాల నుంచి ఉత్తమ ఆటగాళ్ల జాబితాను తయారు చేసిన వార్న్.. ఆ జాబితాలో సచిన్‌కు అగ్రస్థానం ఇచ్చాడు. ఎడమ చేతివాటం ఆటగాళ్లలో లారా అత్యుత్తమ ఆటగాడని, కొన్ని సందర్భాల్లో సచిన్ కంటే అతడే అత్యుత్తమం అని చెప్పవచ్చని అన్నాడు.

వెస్టిండీస్ నుంచి లారా అత్యుత్తమ ఆటగాడని వార్న్ తెలిపాడు. సచిన్ కంటే లారా గొప్ప ఆటగాడని కొందరు అంటుంటారని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో అది నిజమని చెప్పవచ్చన్నాడు. తన తరంలో ఎడమ చేతి వాటం ఆటగాళ్లలో లారానే అత్యుత్తమని వార్న్ చెప్పాడు. 145 టెస్టులాడిన వార్న్.. 708 వికెట్లు తీసుకున్నాడు.

'టెస్ట్ మ్యాచ్ లో ఒకరోజు మిగిలుండి 400 పరుగులు చేయాల్సి ఉంటే.. ఎవరైనా లారా బ్యాటింగ్ దిగాలని కోరుకుంటారు. అతడు వచ్చి అలవోకగా 200 పరుగులు చేసి మ్యాచ్ గెలుపును నిర్దేశిస్తాడు. అతని ఆటతీరు బాగుంటుంది. గ్యాప్‌లలో షాట్స్ కొట్టడం అతనికే సాధ్యం. లారా గొప్ప ఆటగాడు. మంచి స్నేహితుడు' అని వార్న్ పేర్కొన్నాడు.

కాగా, అంతర్జాతీయ టెస్ట్, వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిటే ఉంది. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన తర్వాత సచిన్ రిటైరయ్యాడు. లారా 131 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. టెస్ట్ మ్యాచ్‌లో అత్యధికంగా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు లారా. ఈ రికార్డు అలాగే ఉంది.

షేర్న్ వార్న్ బౌలింగ్ చేసిన ఉత్తమ బ్యాట్స్‌మన్

భారత్- సచిన్ టెండూల్కర్

ఇంగ్లాండ్ - గ్రాహమ్ గూచ్

దక్షిణాఫ్రికా - హన్సీ క్రోనే, జాక్వెస్ కల్లిస్

పాకిస్థాన్ - సయీద్ అన్వర్

వెస్టిండీస్ - బ్రియాన్ లారా

శ్రీలంక - అరవిందా డిసిల్వా

జింబాబ్వే - డేవ్ హౌటన్

బంగ్లాదేశ్ - మొహమ్మద్ అష్రాఫుల్

న్యూజిలాండ్ - మార్టిన్ క్రో

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+