
ముద్దులు పక్కన పెట్టి:
తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ పాకిస్తాన్ జట్టు తాజా ప్రదర్శనపై మండిపడ్డాడు. ముఖ్యంగా పాక్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షాహిన్ అఫ్రిదిపై నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన షాహిన్.. వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లకే ఎక్కువ సమయం కేటాయించాడని చురకలంటించాడు. 'షాహిన్ అఫ్రిది వికెట్లు తీయడం కంటే.. ముద్దులు పెట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఒక్క వికెట్ పడగొట్టగానే ఫ్లైయింగ్ కిస్‌లు పెట్టడంలో అర్ధం లేదు. ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది. ముద్దులు, కౌగిలింతలు పక్కకు పెట్టి.. ముందు వికెట్లు ఎలా తీయాలో ఆలోచించాలి' అని అన్నాడు.

ఏ పిల్లాడైనా క్రికెట్ ఆడతాడా:
పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌పై కూడా షోయబ్ అక్తర్ ధ్వజమెత్తాడు. 'బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలోనూ అంత కష్టపడడం ఏంటి?. ఇది పాక్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన. ఇలానే ఆడితే భవిష్యత్తులో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులుండరు. పాక్ పేలవ ప్రదర్శన ఇలానే కొనసాగితే బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు 3-0తో ఇంగ్లండ్ చేతిలో ఓడడం ఖాయం. పాక్ బ్యాటింగ్ ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఇలాంటి జట్టును చూశాక ఏ పిల్లాడైనా క్రికెట్ ఆడతాడా?. చూస్తుంటే ఇంతా పీసీబీ ప్లాన్‌లా ఉంది. ఎవరూ క్రికెట్‌ను చూడకపోతే, ఎవరూ క్రికెట్ ఆడకపోతే ఏ పనిచేయకుండా హాయిగా ఉండొచ్చని పీసీబీ భావిస్తున్నట్టుంది' అని అక్తర్ ధ్వజమెత్తాడు.

సాకులు చెప్పొద్దు:
సిరీస్‌కు ముందు సరిపడా సమయం లేదని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ హితవు పలికాడు. మ్యాచ్‌కు కేవలం రెండున్నర రోజులు ముందే ఇంగ్లండ్ జట్టు అక్కడికి వచ్చింది, వారు కలిసి జట్టుగా ఆడగలిగినప్పుడు మీకేమైందని నిలదీశాడు. ఇంగ్లండ్ అకాడమీ టీంతో కూడా ఓడిపోతారా? అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. పటిష్ట పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి జట్టు విజయాలు అందుకుంది. శ్రీలంక పర్యటన అనంతరం పాకిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు ఇంగ్లండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.

444 వికెట్లతో:
రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రిటైర్మెంట్ అనంతరం అక్తర్ కామెంటేటర్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టాడు.


Click it and Unblock the Notifications












