నాలుగు వికెట్లు తీసిన జునైద్ ఖాన్
బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికర్ రహీమ్ (116 బంతుల్లో 99), మహమ్మద్ మిథున్ (60) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 48.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. షా అఫ్రీది, హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
పాక్‌ను 4/43తో దెబ్బకొట్టిన ముస్తాఫిజుర్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను ముస్తాఫిజుర్ (4/43) దెబ్బ కొట్టడంతో పాక్ ఓవర్లన్నీ ఆడి 202/9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ (83) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2015 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 4 వన్డేలు జరిగితే అన్ని మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ జట్టే విజయం సాధించింది.
బంగ్లా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్
బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు మండిపడుతున్నారు. సర్ఫరాజ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 95 మ్యాచ్‌లు ఆడిన అతడు చేసింది రెండు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు మాత్రమే.. అలాంటి ఆటగాడు జట్టును నడిపిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
థాంక్యూ అల్లా.. భారత్ చేతిలో మూడో ఓటమిని తప్పించావ్
మరొక నెటిజన్ "భారత్ చేతిలో మూడో ఓటమిని తప్పించుకోవడం ఎలా? బంగ్లాదేశ్ లాంటి పసికూన చేతిలో ఓడితే సరిపోతుంది. ఈ విధంగా పాక్.. భారత్ చేతుల్లో ఓటమిని తప్పించుకుంది. వాళ్లు ఈ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. "థాంక్యూ అల్లా.. భారత్ చేతుల్లో వరుసగా మూడో ఓటమిని తప్పించావ్" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications













