For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుజ్జర్..ఫ్రమ్ లాహోర్: హైట్ ఎంతో తెలుసా?: బ్యాట్స్‌మెన్లకు చుక్కలే: వన్డేల్లో ఎంట్రీకి రెడీ

At 7 feet 6 inches, world’s tallest cricketer Mudassar Gujjar hopes to play for Pakistan one day

లాహోర్: ఈ ఫొటో చూస్తోంటే మీకేమనిపిస్తోంది? ఓ మనిషి ఇంత హైట్ ఉండగలడా? అంత ఎత్తున్న వ్యక్తి క్రికెట్ ఆడితే..అదీ ఫాస్ట్ బౌలింగ్ చేస్తే.. ఎలా ఉంటుంది? అతని వద్ద నుంచి వెలువడే బంతులను బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొనగలరు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అవన్నీ వాస్తవరూపం దాల్చబోతున్నాయి. అత్యంత పొడగరిగా గుర్తింపు ఉన్న ఆ క్రికెటర్.. త్వరలోనే అంతర్జాతీయ మ్యాచుల్లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అతని పేరు ముదస్సర్ గుజ్జర్. వయస్సు 21 సంవత్సరాలు. పాకిస్తాన్‌కు చెందిన అప్ కమింగ్ పేస్ బౌలర్. లాహోర్‌కు చెందిన గజ్జర్.. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు కూడా. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల కోసం లాహోర్ ఖలందర్స్ టీమ్ అతణ్ని తీసుకుంది. ఆ యువ క్రికెట్ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. పాకిస్తాన్‌కే చెందిన ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్.. ఎత్తను అతను డామినేట్ చేశాడు. ఇర్ఫాన్ ఎత్తు 7 అడుగుల ఒక్క అంగుళం. ముదస్సర్ గుజ్జర్ హైట్.. అతని కంటే ఇంకో అయిదు అంగుళాలు ఎక్కువే.

లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఎంపికైన గుజ్జర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సక్సెస్ అయితే.. ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశం ఉండదు. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముదస్సర్ గుజ్జర్ షూ సైజు 23.5 ఇంచ్‌లు. అతని తల్లిదండ్రుల ఎత్తు సాధారణమే. తండ్రి హషీమ్ మొహమ్మద్ హైట్ 5 అడుగుల ఆరు అంగుళాలు. తల్లి పర్వీన్ ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. వారికి భిన్నంగా గుజ్జర్ హైట్ ఇంతెత్తు పెరిగాడు.

హైస్కూల్‌లో చేరేటప్పటికే అతని ఎత్తు ఏడు అడుగులుగా నమోదైంది. క్రమంగా మరింత ఎత్తు పెరిగాడు. స్కూల్ మొత్తానికీ అతనే అత్యంత పొడగరి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారు. డాక్టర్‌ను సంప్రదించారు. అతణ్ని పరీక్షించిన డాక్టర్లు.. హార్మోన్ల ప్రభావం వల్ల ఎత్తు పెరుగుతున్నట్లు నిర్ధారించారు. ఇంత ఎత్తు ఉండటం వల్ల సైకిల్ తొక్కలేకపోతున్నానని, ఆటోల్లో ట్రావెల్ చేయలేకపోతున్నానని చెబుతున్నాడతను.

తనకు స్కూల్ డేస్ నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడిందని, ఫాస్ట్ బౌలింగ్ చేసే వాడినని అన్నాడు. కాలేజ్ దశకు వచ్చే సరికి ఫాస్ట్ బౌలింగ్‌లో మెళకువలను నేర్చుకున్నానని, అంతర్ కళాశాల టోర్నమెంట్లలో ఆడేవాడినని చెప్పాడు. తనను మరింత ప్రోత్సహించడానికి లాహోర్ ఖలందర్స్ టీమ్ ముందుకొచ్చిందని, పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లతో తాను మరింత రాటుదేలుతాననీ అన్నాడు. పాకిస్తాన్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తానని ముదస్సర్ గుజ్జర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 9, 2020, 12:27 [IST]
Other articles published on Oct 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+