42 అయినా ఫిట్‌గా ఉన్నా: వీడ్కోలుపై మిస్బా సంచలనం
హైదరాబాద్: పాకిస్థాన్ జట్టుకు మూడు ఫార్మెట్లలో ఒకే కెప్టెన్ నియమించే ప్రయత్నంలో భాగంగా పీసీబీ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను తప్పుకోమని కోరగా, 42 ఏళ్ల మిస్బా అందుకు ససేమిరా అంటున్నాడు. అసలు తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ బోర్డుని ప్రశ్నించాడు.
తాను ఫిట్‌గా ఉండటంతో పాటు మార్చి 31 నుంచి వెస్టిండిస్‌తో జరిగే టెస్టు సిరిస్‌కు సన్నద్ధమైన వేళ కెప్టెన్సీ నుంచి తప్పుకోమంటూ పంపడం ఏమిటని బోర్డుని నిలదీశాడు. భారత్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టీ20 పైనల్స్ అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని పీసీబీని అప్పట్లో మిస్బా కోరాడు.
అయితే అప్పుడు జట్టులో యువ ఆటగాళ్లు ఉండటంతో మిస్బా అవసరం జట్టుకు ఉందని భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మిస్బాని బ్రతిమాలి టెస్టు కెప్టెన్‌గా ఉంటాలంటూ విజ్ఞప్తి చేసింది. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కోరిక మేరకు టెస్టు కెప్టెన్‌గా మిస్బా బాధ్యతలు చేపట్టాడు.

పాకిస్థాన్ నెంబర్ వన్
అయితే పాక్ టెస్టు జట్టుకి మిస్బా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్ధానాన్ని సొంతం చేసుకుంది. అయితే అదే జోరుని కొనసాగించడంలో పాకిస్థాన్ జట్టు విఫలమైంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో 0-2, ఆస్ట్రేలియాతో 0-3తో పాక్ ఓటమి పాలైంది.

వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్‌నెస్ అనేదే ముఖ్యం
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్‌గా మిస్బా సేవలు ఇక చాలని, సాగనంపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మిస్బా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ 'ఇక్కడ వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్ నెస్ అనేదే ముఖ్యం. నేను ఫిట్ గానే ఉన్నసమయంలో నన్ను వీడ్కోలు చెప్పమంటున్నారు' అని మిస్బా అన్నాడు.

నేనున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ చెప్పే యోచన లేదు
'నేను చాలా ఫిట్‌గా ఉన్నా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ చెప్పే యోచన లేదు. త్వరలో జరగబోయే పీఎస్ఎల్, రంజీల్లో అద్భుత ప్రదర్శన చేసి నా ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటా. ఫిట్‌గా లేని పక్షంలో నా రిటైర్మెంట్‌పై ఆలోచిస్తా' అని మిస్బా తెలిపాడు.

మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్
కాగా, మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ఒక కెప్టెన్‌నే నియమిస్తే ఆశించిన ఫలితాలు సాధించడానికి ఎంతగానో దోహదం చేస్తుందని పాకిస్థాన్ బోర్డు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన ఘోర పరాభవానికి కెప్టెన్ అజహర్ అలీని బాధ్యున్ని చేస్తూ దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు పీసీబీ సిద్ధమవుతోంది.

అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధాన చర్చ
ఇందులో భాగంగా లాహోర్‌లో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్, ప్రధాన కోచ్ ముస్తాక్ అహ్మద్‌లు భేటీ అయ్యారు. ఈ భేటీలో అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధానంగా చర్చించారు. పాక్ టీ20 కెప్టెన్‌గా ఉన్న సర్పరాజ్‌ను వన్డే కెప్టెన్‌గా చేయాలని పీసీబీ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications