Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే- జ్యోతిష్యుల జోస్యం ఇదే!

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఇవాళ ఫైనల్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ చూసిన క్రికెట్ సందడే కనిపిస్తోంది! 13 ఏళ్లగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ కలను సాకరం చేసుకోవడానికి వేళైందని భారత అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మరోవైపు భారత జట్టు గెలవాలని కొందరు అభిమానులు పూజలు చేస్తున్నారు.

బలాబలాల పరంగా భారత్, దక్షిణాఫ్రికా ఇరు జట్లు సమవుజ్జీలే. డికాక్, మార్క్‌రమ్ క్లాసెన్, మిల్లర్‌లతో సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతంగా ఉంది. ప్రత్యర్థికి దీటుగా భారత బ్యాటింగ్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య వంటి స్టార్ బ్యాటర్లతో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌‌లో నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు ఉన్నాయి. రబాడ, నోకియా, జేన్సన్‌తో ప్రొటీస్; బుమ్రా, అర్షదీప్‌‌లతో టీమిండియా బలంగా ఉంది.

Astrology Prediction Winner of India vs South Africa T20 World Cup Final Revealed

స్పిన్ విభాగంలో కేశ్‌వ్ మహరాజ్, షంసీకి పోటీగా కుల్‌దీప్ యాదవ్, అక్షర్, జడేజా ఉన్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుపై జోతిష్యులు తమ జోస్యం మొదలుపెట్టారు. దక్షిణాఫ్రికా ఎంత బలంగా ఉన్నా భారత జట్టే విశ్వవిజేతగా నిలుస్తుందని చెబుతున్నారు. జూన్ నెల, 25వ నెంబర్ టీమిండియాకు కలిసొస్తుందని, అంతేగాక ఇవాళ రోహిత్‌కు మంచి గ్రహస్థానం ఉందని అంటున్నారు.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్ జరిగే తేదీ 29-6-2024. తేదీలో ప్రతి అంకెను (2+9+6+2+0+2+4) కలిపితే 25 వస్తుంది. ప్రపంచకప్‌ను భారత్ తొలిసారి గెలిచిన తేదీ 1983 జూన్ 25. ఈ రెండింటిలో జూన్ కామన్‌గా ఉందని, అంతేగాక తేదీలోని అంకెలు కలిపితే చరిత్ర సృష్టించిన తేదీనే వస్తుందని, ఈ క్రమంలో ఇవాళ భారత్ తప్పక గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

Astrology Prediction Winner of India vs South Africa T20 World Cup Final Revealed

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్ శర్మ‌ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా: డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, నోకియా, షంసి.

Story first published: Saturday, June 29, 2024, 11:35 [IST]
Other articles published on Jun 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+