Shreyas Iyer: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్‌పై ఓ జ్యోతిష్యుడు కీలక భవిష్యత్తును వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్ 2027లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని ఆ జ్యోతిష్యుడు జోస్యం చెప్పారు.
సైంటిఫైక్ ఆస్ట్రాలజర్ గ్రీన్ స్టోన్ లోబో శ్రేయస్ అయ్యర్ జాతకం చాలా అధ్భుతమైనదని తెలిపారు. 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ జాతకంలో ఫ్లూటో గ్రహం అత్యున్నత స్థానంలో ఉందని, నెప్ట్యూన్ గ్రహం కూడా అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. అందుకే శ్రేయస్ అయ్యర్ ఏ ఫార్మాట్‌లో అయినా భారత జట్టుకు కెప్టెన్ గా ఉండే శక్తి ఆయన జాతకానికి ఉందని లోబో అన్నారు.

2027లో కీలక మార్పులు
శ్రేయస్ అయ్యర్ జాతకంలోని గ్రహాలు 2027లో అత్యంత శక్తివంతంగా మారతాయని లబో వెల్లడించారు. ఈ గ్రహస్థితుల కారణంగా అతను తప్పకుండా జట్టులో ఉంటాడని, అతని పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని అంచనా వేశారు. 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తాడని లోబో చెప్పారు.
తాజా వివాదం
ఆసియా కప్ 2025 కోసం శ్రేయస్ అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కావడం గమనార్హం. గతంలో రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వన్డే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చినా, బీసీసీఐ కార్యదర్శి ఆ వార్తలను ఖండించారు.
జ్యోతిష్యుడి ఈ జోస్యం క్రికెట్ అభిమానుల్లో, క్రీడా పండితుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.