Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అడిలైడ్ టెస్ట్: ఆసిస్ స్కోర్ 563


అడిలైడ్:అడిలైడ్ ఓవెల్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో పాంటింగ్, క్లార్క్, హేడెన్ సెంచరీలు, జాక్వస్ అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ధీటుగా స్పందించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు 563 పరుగుల వద్ద తెరపడింది. దీంతో ఆసిస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల స్వల్ప ఆధిక్యతను సాధించింది. ఆదివారం ఉదయం 322/3 ఓవర్‌నైట్ స్కోరుతో పాంటింగ్, క్లార్క్‌లు ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరూ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ ఆస్ట్రేలియా స్కోరు బోర్డును సురక్షిత స్థితికి చేర్చారు. ముందురోజు నుంచి ఆచితూచి ఆడుతున్న వీరిద్దరిలో పాంటింగ్ మొదట సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సెంచరీ అనంతరం క్రీజ్‌లో నిలబడేందుకు ఇబ్బందిపడ్డ పాంటింగ్ బైరన్నర్ సాయం కూడా తీసుకున్నాడు.

140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాంటింగ్ (140) సెహ్వాగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అనంతరం సెంచరీ పూర్తి చేసుకున్న క్లార్క్ (118) ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లక్ష్మణ్‌కు క్యాచ్చి అవుటయ్యాడు.పాంటింగ్, క్లార్క్‌లు నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 210 పరుగుల కీలక భాగస్వామ్యం ఆస్ట్రేలియాను భారత్ భారీ స్కోరుకు చేరువచేసింది. అంతకుముందు రోజు ఓపెనర్ హేడెన్ (103) కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ జాక్వస్ (60)తో కలసి హేడెన్ మొదటి వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు శుభారంభాన్నిచ్చాడు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, సెహ్వాగ్ రెండు, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే చెరో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ గెలిచి మొదట తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఓపెనర్ సెహ్వాగ్, మిడిల్ ఆర్డర్‌లో సచిన్ టెండూల్కర్ (153), వీవీఎస్ లక్ష్మణ్ (51), కిందివరుసలో అనిల్ కుంబ్లే (87), హర్భజన్ సింగ్ (63) రాణించడంతో 526 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఆసిస్ బౌలర్లలో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బ్రెట్‌లీ మూడు, హాగ్, క్లార్క్, సైమండ్స్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో ఇన్నింగ్సులో ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 45 పరుగులు చేశారు. ఓపెనర్ పఠాన్ డకౌట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి సెహ్వాగ్ 31 పరుగులతో, ద్రావిడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Story first published: Sunday, January 27, 2008, 15:18 [IST]
Other articles published on Jan 27, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+