న్యూఢిల్లీ: తనకు హెడ్ కోచ్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రవిశాస్త్రి విషయంపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బిసిసిఐ సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ మరోసారి పెదవి విప్పారు. హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను ఎంపిక చేసిన తర్వాత అతని సారథ్యంలో భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండాలని రవిశాస్త్రిని సలహా కమిటి కోరినట్లు గంగూలీ తెలిపాడు.
బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించేందుకు రవిశాస్త్రి అంగీకరించలేదని గంగూలీ చెప్పాడు. కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా కమిటీలో గంగూలీతోపాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. టీమిండియా అసిస్టెంట్ కోచ్‌ల నియామకాన్ని కుంబ్లేకే వదిలేశామని చెప్పాడు.

కుంబ్లేను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత వ్యక్తిగతంగా రవిశాస్త్రికి తనకు మధ్య జరిగిన వాగ్వివాదంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని గంగూలీ మీడియాతో అన్నారు. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించాడు.
ఆ విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని, ఒకవేళ బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ మొగ్గు చూపితే అతను ఏడాదంతా అందుబాటులో ఉంటాడా, లేడా అనేది బిసిసిఐ చూసుకుంటుందని అన్నాడు.హెడ్ కోచ్ పదవికి జరిగిన పోటీలో ఉన్నవారిని సలహా కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అయితే రవిశాస్త్రిని లక్ష్మణ్, సచిన్ మాత్రమే ఇంటర్వ్యూ చేశారు.
తనతో ముఖాముఖి జరిగిన సమయంలో గంగూలీ లేని విషయాన్ని రవిశాస్త్రి తప్పుగా చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గతంలో టీమిండియాకు డైరెక్టర్‌గా రవిశాస్త్రి ఉన్న సమయంలో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌నే ప్రస్తుతం కుంబ్లే ఆధ్వర్యంలో కూడా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు.