Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారీ సిక్సర్ బాది.. నో నో అంటూ ఫీల‌యిన బ్యాట్స్‌మన్‌! ఎందుకో ఈ వీడియో చూడండి!!

Asif Alis massive six smashes windscreen of his own car

హైదరాబాద్: స్టేడియం బయటకు వెళ్లేలా భారీ సిక్స్ కొట్టాలని ప్రతి బ్యాట్స్‌మన్‌ కలలు కంటాడు. సరైన బంతి దొరికితే భారీ సిక్సర్ బాది.. తన సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే ఓ బ్యాట్స్‌మన్‌ స్టేడియం బయటకు బంతిని పంపించినందుకు తెగ ఫీల‌య్యాడు. కార‌ణం ఏమై ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా?. ఎందుకంటే.. ఆ బ్యాట్స్‌మ‌న్ కొట్టిన సిక్స్ స్టేడియం బ‌య‌ట ఉన్న త‌న సొంత కారు వెనుక అద్దాన్ని బ‌ద్ధ‌లుకొట్టింది. ఇంగ్లండ్‌లోని ఓ క్లబ్‌ క్రికెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇంగ్లండ్‌​ యార్క్​షైర్​లో ఇల్లింగ్‌వర్త్‌ సెయింట్‌ మేరీస్‌, వెస్ట్‌ యార్క్‌షైర్‌ క్రికెట్ క్లబ్​ల మధ్య ఆదివారం ఓ మ్యాచ్ జరిగింది. అసిఫ్ అలీ అనే యువ క్రికెటర్‌ ఇల్లింగ్‌వర్త్‌ సెయింట్‌ మేరీస్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడాడు. వెస్ట్‌ యార్క్‌షైర్‌ బౌలర్ ఈ గ్రోగర్ వేసిన ఓ బంతిని అలీ భారీ షాట్‌ ఆడాడు. బౌలర్‌ కాళ్ల వద్ద వేసిన బంతిని లెగ్‌సైడ్‌ తరలించాడు. సిక్సర్‌ బాదానని ఆనందించే లోపే అతడికి భారీ షాక్‌ తగిలింది. ఆ బంతి అతడి కారు ముందు అద్దాన్ని తాకింది. దాంతో అలీ గుండె పగిలినంత పనైంది. క్రీజులోనే బ్యాట్ పక్కకువిసిరి.. తన రెండు చేతులతో తల పట్టుకున్నాడు.

ఈ ఘటన చూసిన ఇల్లింగ్‌వర్త్‌, యార్క్‌షైర్‌ జట్ల ఆటగాళ్లు నవ్వులు పూయించారు. 24 సెక‌న్ల ఈ వీడియోను 24 గంట‌ల్లోనే ల‌క్ష‌ల మంది చూశారు. అలీ సిక్స్ కొట్ట‌డం.. ఆ వెంట‌నే పెద్ద శ‌బ్దం రావ‌డం, ప్లేయ‌ర్స్ అంతా ఒక్క‌సారిగా పెద్ద‌గా న‌వ్వ‌డం, అలీ షాక్ తిన‌డం వీడియోలో క‌నిపిస్తుంది. పార్కింగ్‌లో ఉన్న అలీ కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసం కావ‌డం కూడా చూడొచ్చు. ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రైన్ కొట్టిన బాల్ ఇలా ఓ కారు అద్దం ప‌గ‌ల‌గొట్టింద‌ని, విష‌యం తెలుసుకున్న కారు డీల‌ర్ ఫ్రీగానే స‌ర్వీస్ చేశాడ‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. షాట్ బాగుంది కానీ.. ఆ కారు టైమ్ బాగా లేద‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు.

'ఆ బంతి నా కారువైపు వెళ్తుంటే.. ఓహ్‌ నో నో ఏం జరుగుతోంది? అనుకున్నాను. అంతలోనే ఆ బంతి నా కారు ముందు అద్దంపై పడింది. నేను షాక్‌ అయ్యాను. చాలా కాలంగా నేనీ క్లబ్‌కు ఆడుతున్నాను. ప్రతిసారీ మైదానం బయటే కారు పార్క్‌ చేసేవాడిని. లోపలికి తీసుకురావడం ఇదే తొలిసారి. ఇలా జరగడం నా దురదృష్టం' అని అసిఫ్ అలీ మీడియాతో చెప్పాడు. అలీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని ఇల్లింగ్‌వర్త్‌ క్లబ్‌ ఛైర్మన్‌ జెరెమీ రోడ్స్‌ తెలిపారు. తమ క్లబ్‌ కోసం అలీ ఎన్నోసార్లు పరుగులు చేశాడని తెలిపారు. అలీ టాక్సీ డ్రైవర్‌ అన్న విషయం తెలిసిందే. కారే అతడి జీవనాధారం.

Story first published: Tuesday, June 22, 2021, 19:12 [IST]
Other articles published on Jun 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+